ఘోరం.. కుటుంబ సభ్యులను కట్టేసి, వారి ఎదుటే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం..
నలుగురు దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి, ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులను కట్టేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన హర్యానాలోని పానిపట్ లో జరిగింది.
హర్యానాలో ఘోరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ముగ్గురు మహిళలపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి, వారి ఎదుటే ఈ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న నగలు, డబ్బులను దోచుకొని వెళ్లారు. ఈ ఘటన పానిపట్ లో జరిగింది.
ఘోరం.. గిన్నెకు కాలు తగిలిందని.. 14 ఏళ్ల బాలికను మూడో అంతస్తు నుంచి నెట్టేసిన మహిళ..
‘ఎన్టీటీవీ’ కథనం ప్రకారం.. పానిపట్ లోని ఓ ప్రాంతంలో మహిళా కూలీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి వారి ఇంట్లో నిద్రపోతున్నారు. ఈ క్రమంలో అర్థరాత్రి దాటిన తరువాత నలుగురు గుర్తు తెలియని దుండగులు వారి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో వారి చేతుల్లో కత్తులు, ఇతర పదునైన ఆయుధాలు ఉన్నాయి.
EXCLUSIVE : ఇస్రో తయారీ పరికరాన్ని నాసా ఇష్టపడింది.. తమకే ఇవ్వాలని కోరింది - చైర్మన్ సోమనాథ్
లోపలికి వచ్చిన తరువాత ఆ మహిళా కూలీల కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. అనంతరం వారి ఎదుటే ఆ మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత వారి వద్ద ఉన్న నగదు, డబ్బులను దోచుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కిలోమీటరు దూరంలో బుధవారం రాత్రి కూడా అలాంటిదే మరో దారుణం జరిగింది.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఘటన
అక్కడ ఓ దంపతుల ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళపై దుండగులు దాడి చేశారు. దీంతో ఆమె మరణించింది. అనంతరం ఆమె భర్త వద్ద ఉన్న డబ్బులను దోచుకొని వెళ్లిపోయారు. దీంతో పాటు అతడి సెల్ ఫోన్ ను కూడా ఎత్తుకెళ్లిపోయారు. రెండో ఘటన కూడా మొదటి ఘటనను పోలి ఉంది. దీంతో రెండు ఘటనల్లోనూ ఒకే ముఠా ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు ఘటనలు ఒకే గ్రామంలో జరిగాయని పానిపట్ లోని మట్లౌడా పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయ్ తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.