సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (bipin rawat) బావమరిది యశ్ వర్ధన్ సింగ్ (yash vardhan singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుమతి లేకుండా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన భూమిని స్వాధీనం చేసుకుందని మండిపడ్డారు.
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (bipin rawat) బావమరిది యశ్ వర్ధన్ సింగ్ (yash vardhan singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుమతి లేకుండా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన భూమిని స్వాధీనం చేసుకుందని మండిపడ్డారు. జాతీయ రహదారి పనుల కోసం తన సొంత భూమిని వినియోగిస్తున్నట్లు ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. రావత్ మరణించిన వారం రోజులకే ఆయన బావమరిది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశంలో చర్చనీయాంశమైంది. తన బావ బిపిన్ రావత్, సోదరి మధులికా రావత్ అంత్యక్రియల రోజు ఈ విషయాన్ని తాను గుర్తించినట్లు యశ్ వర్ధన్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఎలాంటి నష్టపరిహారమూ అందించలేదని ఆయన ఆరోపించారు.
దేశానికి సేవచేసేందుకు ముందుంటామని, కానీ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా ఈ విధానాన్ని ఎలా అనుసరిస్తారు? అని యశ్ వర్ధన్ సింగ్ ప్రశ్నించారు. బిపిన్ రావత్ సతీమణి మధులిక స్వస్థలమైన మధ్యప్రదేశ్లోని షహడోల్ జిల్లా రాజాబాఘ్ సోహగ్పుర్లో జాతీయ రహదారికి ఆనుకొని సింగ్ కొంత భూమి ఉంది. ప్రస్తుతం అక్కడే జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నట్లు యశ్ వర్ధన్ సింగ్ పేర్కొన్నారు.
ALso REad:Sulur Helicopter crash: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి
కాగా.. ఈ వ్యవహారం షహడోల్ జిల్లా కలెక్టర్ వందనా వైద్య వరకు చేరింది. దీనిపై విచారణ జరిపిస్తానని, తహశీల్దార్ సహా ఇతర అధికారులను సంఘటనా స్థలానికి పంపి విచారణ చేయిస్తామని కలెక్టర్ వెల్లడించారు. అటు ఈ అంశంపై రాష్ట్ర హోం మంత్రి (madhya pradesh home minister) నరోత్తమ్ మిశ్రా (narottam mishra) కూడా ట్వీట్ చేశారు. ఎస్పీ నుంచి పూర్తి వివరాలు కోరిన ఆయన.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి హెచ్చరించారు.
