కేరళ రాష్ట్రంలోని ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ దేవాలయం త్రిస్సూర్ జిల్లాలో ఉన్న ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ దేవాలయంలో ఇక నుంచి రోబోటిక్ ఏనుగు ఆచార వ్యవహారాలను నిర్వహించనుంది. వేడుకల సమయంలో ఈ ఏనుగు ద్వారానే పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
దేవాలయాల్లో జరిగే ఉత్సావాల్లో, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఏనుగులను ఉపయోగించడం మనం చూస్తుంటాం. కొన్ని వేడుకల సమయాల్లో విగ్రహాలను ఏనుగులపై ఊరేగిస్తుంటారు. అయితే వీటి వల్ల ఏనుగులు హింసకు గురవుతున్నాయని భావించి కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉన్న ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ దేవాలయం ఓ కొత్త ప్రయోగానికి పూనుకుంది. ఆచార వ్యవహారాలు నిర్వహించేందుకు నిజమైన ఏనుగు స్థానంలో ఓ రోబోటిక్ ఏనుగును ప్రవేశపెట్టింది. ఇక నుంచి నిజమైన ఏనుగు చేయాల్సిన క్రతులన్నీ ఏ యాంత్రిక ఏనుగు చేయనుంది.
భార్యకు మెసేజ్ పెట్టి.. హోంగార్డ్ ఆత్మహత్య.. మెసేజ్ లో ఏముందంటే..
ఈ ఏనుగుకు ‘ఇరింజడప్పిల్లి రామన్’ అని నామకరణం చేశారు. ఆదివారం ‘నదయిరుతల్’ అనే ఉత్సావాన్ని నిర్వహించి దేవుడికి అంకితం చేశారు. ఈ ‘ఇరింజదపల్లి రామన్’ దేవాలయంలో వేడుకలను సురక్షితంగా, క్రూరత్వం లేకుండా నిర్వహించడానికి సహాయపడుతుందని, దీని వల్ల నిజమైన ఏనుగుల పునరావాసం కల్పించడానికి, అవి స్వేచ్ఛగా అడవులలో జీవించడానికి తోడ్పడుతుందని ‘పెటా’ ఇండియా పేర్కొంది. ఆదివారం జరిగిన ప్రారంభోత్సవం అనంతరం పెరువనం సతీశన్ మరార్ నేతృత్వంలోని తాళాల వాద్య బృందం ప్రదర్శన జరిగింది.
ఆలయ ప్రధాన అర్చకుడు రాజ్ కుమార్ నంబూద్రి మాట్లాడుతూ.. ‘‘ ఈ యాంత్రిక ఏనుగును స్వీకరించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మన ఆచారాలు, పండుగలను క్రూరత్వం లేకుండా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇతర దేవాలయాలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తాయని, ఆచారాల కోసం సజీవ ఏనుగులను ఉపయోగించుకుండా ఉంటాయని ఆశిస్తున్నాను.’’ అని అన్నారు.
కేరళతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో చెరలో ఉన్న ఏనుగుల్లో అనేకం అక్రమంగా పట్టుకున్నవే. ఇలా అక్రమంగా బంధించి వాటిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇలా బంధించిన ఏనుగులు తమకు నచ్చిన విధంగా మలుచుకునేందుకు, వాటిని సవారీలు, ఊరేగింపుల కోసం ఉపయోగించేందుకు వాటికి కఠినమైన శిక్షలు విధిస్తున్నారు. క్రూరంగా కొడుతున్నారు. లోహపు ఆయుధాలను ఉపయోగించి వాటికి శిక్షణ ఇస్తూ కంట్రోల్ చేస్తారు. గంటల తరబడి కాంక్రీట్ కు గొలుసులతో కట్టి ఉంచడం వల్ల చాలా ఏనుగుల కాలికి గాయాలు అవుతున్నాయి. పాదాలకు పలు వ్యాధులు వస్తున్నాయి. దీంతో పాటు అనేక ఏనుగులకు సరైన ఆహారం, నీరు, వైద్య సంరక్షణ లభించదు.
దేశ ప్రయోజనాల కోసం అగ్నిపథ్.. జోక్యం చేసుకోలేం: పిటిషన్లు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ఇలా బంధీగా ఉన్న ఏనుగులు నిరాశ చెంది, ఆక్రోశానికి లోనై ఒక్కో సారి అసాధారణంగా ప్రవర్తిస్తాయి. క్రూరంగా దాడులు కూడా చేస్తాయి. మనుషులపై, ఇతర జంతువులపై విరుచుకుపడతాయి. బందీ నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాయి. చెర నుంచి విముక్తి అయిన తరువాత ఉల్లాసంగా పరిగెడుతూ మానవులకు, ఇతర జంతువులకు, ఆస్తికి హాని కలిగిస్తాయి.
హెరిటేజ్ యానిమల్ టాస్క్ ఫోర్స్ సేకరించిన గణాంకాల ప్రకారం.. కేరళలో 15 ఏళ్ల కాలంలో బందీ ఏనుగులు 526 మందిని చంపాయి. దాదాపు 40 ఏళ్లుగా చెరలో ఉన్న ‘తెచికట్టుకావు రామచంద్రన్’ అనే ఏనుగును కేరళ ఫెస్టివల్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఏనుగు ఇంత వరకు 13 జీవులను చంపినట్టు నివేదికలు ఉన్నాయి. ఇందులో ఆరుగురు మావటిలో ఉండగా.. నలుగురు మహిళలు. మరో మూడు ఏనుగులు ఉన్నాయి.
