దొంగల ఔదార్యం! ఇంట్లో దోచుకునేంత గొప్పవేమీ కనిపించకపోవడంతో రూ. 500 పెట్టి పరార్
ఢిల్లీలో ఓ ఇంటిలో దొంగలు పడ్డారు. కానీ, వృద్ధ దంపతులు నివసిస్తున్న ఆ ఇంటిలో చోరీ చేయదగ్గ వస్తువులేవీ వారికి కనిపించలేదు. అంతేకాదు, అక్కడే రూ. 500 పెట్టి పోయారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. 80 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ ఇంటిలో కొందరు దొంగలు పడ్డారు. కానీ, ఆ ఇంట్లో దోచుకోడానికి అంత గొప్ప వస్తువులేమీ వారికి కనిపించలేవు. దీంతో వారు ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లిపోవడమే కాదు.. వెళ్లడానికి ముందు రూ. 500 ఆ ఇంట్లో పెట్టి పారిపోయారు. ఈ ఘటన ఢిల్లీలో రోహిణిలోని సెక్టార్ 8లో జులై 20, 21వ తేదీల మధ్య రాత్రి చోటుచేసుకుంది.
ఆ రోజు ఎం రామక్రిష్ణ, ఆయన భార్యతో కలిసి గురుగ్రామ్‌లో నివసిస్తున్న కొడుకు వద్దకు జులై 19వ తేదీన వెళ్లారు. జులై 21వ తేదీన పొరుగువారు రామక్రిష్ణకు ఫోన్ చశారు. ఇంటలో దొంగలు పడ్డారని వివరించారు. ఈ సమాచారం అందుకోగానే రామక్రిష్ణ వెంటనే ఇంటికి వెళ్లాడు. ఆయనకు మెయిన్ గేట్ తాళం పగిలి కనిపించింది. ఆ తర్వాత ఆయన ఇంటి లోపలికి వెళ్లాడు. అక్కడ దొంగలు ఏమీ చోరీ చేసినట్టు కనిపించలేదు. వారు ఏమీ చోరీ చేయలేకపోయారని గ్రహించాడు.
Also Read: పాకిస్తాన్‌లోని లవర్ కోసం బార్డర్ దాటిన మహిళ.. రాజస్తాన్ నుంచి పాక్.. వెళ్లాక భర్తకు ఏం చెప్పిందంటే?
అనంతరం, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. తన ఇంటిలో దొంగలు పడ్డారని, కానీ, ఏమీ చోరీ జరగలేదని పోలీసులకు తెలిపాడు. అంతేకాదు, మెయిన్ గేట్ వద్ద రూ. 500 వదిలిపెట్టి వెళ్లిపోయారనీ వివరించాడు. అల్మారాలు పటిష్టంగా ఎప్పట్లాగే ఉన్నాయని చెప్పాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు ఫైల్ చేశారు. దొంగలు పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు.