డబ్బు ఇస్తావా..? కాల్చమంటావా.?.. ఢిల్లీలో తుపాకీతో బెదిరించి రూ.70 లక్షలు దోపిడి

robbery in delhi
Highlights

దేశరాజధాని ఢిల్లీలో సినీ ఫక్కీలో దోపిడి జరిగింది. రద్దీగా ఉండే ఫ్లైఓవర్‌పై అందరూ చూస్తుండగానే కొందరు దుండగులు కారుని ఆపి అందులోని వ్యక్తిని తుపాకీతో బెదిరించి అతని వద్ద నుంచి రూ.70 లక్షలు ఎత్తుకెళ్లారు

దేశరాజధాని ఢిల్లీలో సినీ ఫక్కీలో దోపిడి జరిగింది. రద్దీగా ఉండే ఫ్లైఓవర్‌పై అందరూ చూస్తుండగానే కొందరు దుండగులు కారుని ఆపి అందులోని వ్యక్తిని తుపాకీతో బెదిరించి అతని వద్ద నుంచి రూ.70 లక్షలు ఎత్తుకెళ్లారు. ఢిల్లీకి చెందిన కాశిష్ బన్సాల్ గురువారం తన ఇంటి నుంచి కారులో గురుగ్రామ్ వెళుతుండగా.. నరైనా ప్రాంతంలో ఫ్లైఓవర్‌పై వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెంబడించి బన్సాల్ కారును ఆపాడు.

దీంతో భయపడిన కాశిష్ వెనుక సీట్లో నుంచి కిందకి దిగేందుకు ప్రయత్నించగా.. దుండగుల్లో ఒకడు తుపాకీతో ఆయనను బెదిరించాడు.. అనంతరం కారు డిక్కీలో ఉన్న రూ.70 లక్షల బ్యాగ్‌ను తీసుకుని పరారయ్యారు. ఫ్లైఓవర్ మధ్యలో కొన్ని వేల మంది ఈ తతంగాన్ని చూస్తూనే ఉన్నారు. కొందరు నిందితులను ఆపేందుకు ప్రయత్నం చేయాలనుకుంటున్నప్పటికీ దుండగుల చేతిలో తుపాకీ ఉండటాన్ని గమనించి వెనుకడుగు వేశారు.

బన్సాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది తెలిసిన వారి పనిగానే పోలీసులు భావిస్తున్నారు.. కాశిష్ డబ్బుతో వస్తున్నట్లు తెలిసిన వ్యక్తులే దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

loader