రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. నుజ్జునుజ్జయిన 12 మంది

road accident in rajasthan
Highlights

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.. ప్రయాణికులతో అజ్మీర్‌ వైపు వెళుతున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా.. 21 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.. ప్రయాణికులతో అజ్మీర్‌ వైపు వెళుతున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా.. 21 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సు నామరూపాల్లేకుండా పోయింది. ఇందులో ప్రయాణిస్తున్న వారి శరీరాలు నుజ్జనుజ్జయ్యాయి.

పెద్ద శబ్ధం విని అటుగా వెళ్తున్న స్థానికులు పరుగుపరుగున వచ్చి క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు.. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. డ్రైవర్ అతి వేగంతో బస్సును నడపడం వల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు.

loader