Asianet News TeluguAsianet News Telugu

మంచానికే పరిమితమైన దంపతులు.. విసుగు చెంది..!

వారు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో రెండు సూసైడ్ నోట్లు కనపడినట్లు పోలీసులు  చెప్పారు. దానిలో వారు.. తాము మంచానికే పరిమితమైపోయామని.. అలాంటి బతుకు అవసరం లేదని అనిపించిందని.. అందుకే విసిగిపోయి.. ఈ నిర్ణయం తీసుకున్నామని వారు అందులో పేర్కొనడం గమనార్హం.

Retired Delhi University Professor Couple Dies By Suicide: Delhi Police
Author
Hyderabad, First Published Oct 28, 2021, 10:19 AM IST

ఢిల్లీ యూనివర్శిటీ విశ్రాంత ప్రొఫెసర్ దంపతులు.. బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు.. మంచానికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో.. ఇలాంటి జీవితం అవసరమా అని భావించిన ఆ దంపతులు బలవనర్మణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగ్నేయ ఢిల్లాోని గోవింధపురి ప్రాంతంలోని  కల్కాజీ ఎక్స్ టెన్షన్ లోని నివాసం ఉంటున్న రాకేష్ కుమార్ జైన్(74), అతని భార్య ఉషా రాకేష్ కుమార్ జైన్ (69) లు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో రెండు సూసైడ్ నోట్లు కనపడినట్లు పోలీసులు  చెప్పారు. దానిలో వారు.. తాము మంచానికే పరిమితమైపోయామని.. అలాంటి బతుకు అవసరం లేదని అనిపించిందని.. అందుకే విసిగిపోయి.. ఈ నిర్ణయం తీసుకున్నామని వారు అందులో పేర్కొనడం గమనార్హం.

వారు ఆత్మహత్య చేసుకున్నారంటూ.. గోవింద్ పేరి పోలీస్ స్టేలషన్ కు మధ్యాహ్నం 3గంటల 45 నిమిషాల సమయంలో ఫోన్ వచ్చింది. వారి కుమార్తె స్వయంగా పోలీసులకు ఫోన్ చేయడం గమనార్హం. తమ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారని వారు అందులో పేర్కొన్నారు.

Also Read: రైతుల దీక్షలో కూర్చున్న మహిళలపై దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురి మృతి..!

ఈ ప్రొఫెసర్ కుమార్తె అంకిత(47) వేరే ప్రాంతంలో ఉంటుంది. అయితే.. తల్లిదండ్రులను చూసుకోవడానికి మాత్రం  అజిత్ అనే కేర్ టేకర్ నియమించింది. బుధవారం మధ్యాహ్నం కేర్ టేకర్ వచ్చి.. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా.. వారు స్పందించలేదు. దీంతో వెంటనే అంకిత కు సమాచారం అందించారు. ఆమె వచ్చి ఇంటి తలుపులు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. తీరా.. లోపలికి వెళ్లే సరికి.. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించడం గమనార్హం. 

Also Read: కరోనా థర్డ్ వేవ్: కేసులు పెరగడంతో ఆ పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్

గతేడాది యూపీలోని గోండాకు వెళ్తుండగా వృద్ధ దంపతులు ప్రమాదానికి గురయ్యారని పోలీసులు తెలిపారు. రాకేష్ జైన్‌కు వెన్నుముకకు గాయం కాగా, అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు.
వారిద్దరూ మంచాన పడ్డారు. కేర్‌టేకర్ సహాయంతో వారు కొంచెం నడవడం ప్రారంభించారని, కానీ దానితో వారు సంతృప్తి చెందలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios