చిన్న విషయాలకే తరచూ అవమానిస్తోందని భార్యపై కాల్పులు జరిపిన రిటైర్డ్ సీఆర్పీఎఫ్ జవాన్.. ఎక్కడంటే ?
ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ తన భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు. తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రగాయాలతో ఆమె చనిపోయింది. కాల్పులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కోడలును కూడా అతడు కాల్చబోయాడు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగుచూసింది.
చిన్న చిన్న విషయాలకే భార్య తరచూ అవమానిస్తుండటంతో ఆ భర్త అసహనానికి గురయ్యాడు. ఆయన గతంలో సీఆర్పీఎఫ్ జవాన్ గా సేవలు అందించి పదవీ విరమణ పొందాడు. దీంతో ఆయనకు తుపాకీ ఎలా ఉపయోగించాలో అవగాహన ఉంది. చాలా కాలం నుంచి భార్యపై కోపం పెంచుకున్న అతడు ఇంట్లో ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్న సమయంలో భార్యపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో చోటు చేసుకుంది.
రైతుల కోసం ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఖరీఫ్ పంటల ఎంఎస్పీ పెంపు - ప్రధాని మోడీ
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. రాహ్‌పూర్ చుంగి ప్రాంతానికి చెందిన 51 మహేంద్ర సింగ్ సీఆర్పీఎఫ్ జవాన్ గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. ఆగ్రాలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. భార్య, పెద్ద కుమారుడు, కోడలు, మరో కుమారుడు అందరూ ఒకే చోట కలిసే ఉంటున్నారు. అయితే గత కొంత కాలంగా భార్య చిన్న విషయాలకు అవమానిస్తోందని ఆమెపై కోపంగా ఉన్నాడు. దీంతో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు.
తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలు.. కాంగ్రెస్ లోకి చేరనున్న బీజేపీ కీలక నేత ?
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో అతడి భార్య బాత్ రూమ్ బట్టలు ఉతుకుతోంది. ఢిల్లీలోని ఒక ప్రైవేట్ సంస్థలో పని చేసే పెద్ద కుమారుడు వేరే గదిలో ఉన్నాడు. కోడలు పూజ ఇంటి పనుల్లో నిమగ్నమయ్యింది. చిన్న కుమారుడు తన మొబైల్ రిపేర్ చేయించుకోవడానికి బయటకు వెళ్లాడు. భార్యను హతమార్చడానికి ఇదే సరైన సమయం అని భావించాడు. బాత్ రూమ్ బట్టలు ఉతుకుతున్న భార్య దగ్గరికి వెళ్లి తన లైసెన్స్‌డ్ రైఫిల్ తో తలపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఇలా ఏడు రౌండ్ లు కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
డాక్టర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ గర్భిణికి ప్రసవం చేసిన నర్సు.. వికటించి బాలింత మృతి
ఈ బుల్లెట్ల శబ్దం విన్న పూజ పరిగెత్తుకుంటూ మహేంద్ర సింగ్ దగ్గరికి వచ్చింది. కాల్పులను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ అందులో విఫలమైంది. అయితే నిందితుడు కోడలిపై కూడా కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసింది.
విషాదం.. ఇసుకలో జారిపడి, ట్రాక్టర్ చక్రాల కింద నలిగి నాలుగేళ్ల బాలుడు మృతి
అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కోడలు పూజా సింగ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 307 (హత్య ప్రయత్నం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే నిందితుడు నేరం అంగీకరించాడని డీసీపీ వికాస్‌కుమార్ తెలిపారు.