తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలు.. కాంగ్రెస్ లోకి చేరనున్న బీజేపీ కీలక నేత ?
తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్న ఓ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని తెలుస్తోంది. మరో 15 రోజుల తరువాత ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరాయన ? ఎందుకు పార్టీ మారబోతున్నారు ?
తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కొంత కాలం కిందట వరకు నిశ్చలంగా ఉన్న రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు శరవేగంగా మారిపోతున్నాయి. ఒక పార్టీ నుంచి నాయకులు మరో పార్టీలోకి చేరిపోతున్నారు. ఈ పరిణామం ఎక్కువగా కాంగ్రెస్ కు అనుకూలంగా మారింది. ఆ పార్టీలోకి కీలక నేతలు చేరుతున్నట్టు ఇటీవల ప్రచారం సాగుతోంది. కర్ణాటక ఎన్నికల విజయంతో జోరు మీద ఉన్న కాంగ్రెస్.. అదే ఊపులో తెలంగాణలో బలపడాలని ప్రయత్నిస్తోంది.
డాక్టర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ గర్భిణికి ప్రసవం చేసిన నర్సు.. వికటించి బాలింత మృతి
కొంత కాలం నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీలకు వెళ్లిన నాయకులు మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు. దీంతో పాటు ఇతర పార్టీల్లోనూ కీలకంగా ఉన్న నాయకులు ‘హస్తం’ను అందుకుంటున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్న పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టు తెలుస్తోంది.
హిజాబ్ ధరించాలని హిందూ విద్యార్థినులపై ఒత్తిడి.. గంగా జమునా స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు..
తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు పార్టీ మారబోతున్నారే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఆయన ఆరోపించారు. వారి పేర్లు తాను బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడైనా ఆ కోవర్టులు తీరు మార్చుకోకపోతే వారి పేర్లు తాను మీడియాకు తెలియజేస్తానని చెప్పారు. ఈ విషయంలో మరో 15 రోజుల్లో ఓ కీలక ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు.
విషాదం.. ఇసుకలో జారిపడి, ట్రాక్టర్ చక్రాల కింద నలిగి నాలుగేళ్ల బాలుడు మృతి
నందీశ్వర్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఆయన పార్టీని వీడటం ఖాయమనే చర్చ సాగుతోంది. బీజేపీని విడిచిపెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన ఇలా మాట్లాడారని రాజకీయ విశ్లేషణలు జోరందుకున్నాయి. బీజేపీని వీడిన వెంటనే ఆయన కాంగ్రెస్ లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ అలాగే జరిగితే ఇక కాంగ్రెస్ లోకి ఇతర పార్టీలకు చెందిన పలువరు నాయకులు వలస వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆ పార్టీలో చేరడం ఖరారు అయిపోయిందని చర్చ సాగుతోంది.