Asianet News TeluguAsianet News Telugu

రైతుల కోసం ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఖరీఫ్ పంటల ఎంఎస్పీ పెంపు - ప్రధాని మోడీ

ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే తాజాగా ఖరీఫ్ పంటలకు మద్దతు ధర నిర్ణయించామని తెలిపారు. దీని వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Increase in MSP of kharif crops in line with government decisions for farmers - PM Modi..ISR
Author
First Published Jun 8, 2023, 8:24 AM IST

రైతుల ప్రయోజనాల కోసం గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలకు అనుగుణంగా ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దీంతో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. పంటలను వైవిధ్యపరిచే ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

హిజాబ్ ధరించాలని హిందూ విద్యార్థినులపై ఒత్తిడి.. గంగా జమునా స్కూల్ యాజామన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు..

ఈ ఏడాది వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ.143 నుంచి రూ.2,183కు పెంచుతున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. గత పదేళ్లలో వరి ఎంఎస్పీలో అత్యధికంగా 2018-19లో క్వింటాలుకు రూ.200 పెరిగింది. 2023-24 ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీని 5.3 నుంచి 10.35 శాతం వరకు పెంచారు. దీంతో అన్ని పంటలకు క్వింటాలుకు రూ.128 నుంచి రూ.805కు కనీస మద్దతు ధర పెరిగింది. ఇందులో పెసర పంటకు అత్యధికంగా కనీస మద్దతు ధర పెరిగింది. క్వింటాల్ పెసర ధర రూ.7,755 ఎంఎస్పీ ఉండగా.. ఇప్పుడు దానిని రూ.8,558కి  పెంచారు. 

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినేట్ భేటీలో ఈ ఎంఎస్పీ ధర పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మణిపూర్‌ హింస, బాలాసోర్‌ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ, మంత్రులందరూ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా గురుగ్రా హుడా సిటీ సెంటర్ నుంచి సైబర్ సిటీ, గురుగ్రామ్ విత్ స్పర్ నుంచి ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే వరకు మెట్రో కనెక్టివిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

విషాదం.. ఇసుకలో జారిపడి, ట్రాక్టర్ చక్రాల కింద నలిగి నాలుగేళ్ల బాలుడు మృతి

ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సాగుదారులకు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడానికి, పంటల వైవిధ్యతను ప్రోత్సహించడానికి కనీస మద్దతు ధరను పెంచామని చెప్పారు. కనీస మద్దతు ధరను అనేక సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా పెంచాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios