Asianet News TeluguAsianet News Telugu

రిసెప్షనిస్ట్ హత్య కేసు.. సీఎం ఆదేశాలతో రిసార్ట్ కూల్చివేత, కాలువలో మృతదేహం లభ్యం..

హత్య కేసులో అరెస్టైన బీజేపీ నేత కుమారుడికి చెందిన రిసార్టును కూల్చివేయమని ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ఆదేశాలు జారీ చేశారు. 

Resort of arrested BJP leader's son demolished after CMs order over receptionist murder in Uttarakhand
Author
First Published Sep 24, 2022, 12:20 PM IST

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ లో 19యేళ్ల యువతి హత్యోదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్థానిక బీజేపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్యతో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు మూలకేంద్రమైన పుల్కిత్ ఆర్య రిసార్ట్ ను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పరిస్థితి మరీ చేయిజారిపోకముందే కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పుష్కర్ ధామి రిసార్ట్ ను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. రిషికేష్ లోని పుల్కిత్ కు చెందిన వనతారా రిసార్ట్ బుల్డోజర్లు కుప్ప కూల్చాయి. 

ఈ కూల్చివేత.. నేరం చేయాలనుకునేవాళ్లకు భయం పుట్టిస్తోందని యమకేశ్వర్ ఎమ్మెల్యే రేణు బిష్ట్ చెప్తున్నారు. ఈ ఘటనలో వెంటనే చర్యలకు ఆదేశంచిన సీఎం ధామికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు.. బాధితురాలి తల్లిదండ్రుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారిని సస్పెండ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను అరెస్ట్ చేసి.. జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు ఉత్తరాఖండ్ పోలీసులు. 

వ్యభిచారంలోని దింపడాన్ని వ్యతిరేకించిందని రిసెప్షనిస్ట్ హత్య.. బీజేపీ నేత కుమారుడి అరెస్ట్..

దీనిమీద ముఖ్యమంత్ర ధామి స్పందిస్తూ.. ఘటన దురదృష్టకరం అన్నారు. అయితే, పోలీసులు ఈ కేసును వీలైనంత త్వరగా చేధించారని, నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు. నేరస్తులు ఎలాంటి వారైనా కఠిన చర్యలు కచ్చితంగా ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. హరిద్వార్ కు చెందిన బీజేపీ నేత వినోద్ ఆర్య.. ఉత్తరాఖండ్ మతి కళాబోర్డుకు గతంలో చైర్మన్ గా కూడా పని చేశారు. ఈయన కొడుకే పుల్కిత్ ఆర్య. 

సెప్టెంబర్ 18న రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న అంకితా భండారి అనే 19యేళ్ల యువతి కనిపించకుండా పోయింది. దీంతో అంతా వెతికిన ఆమె తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వారం తరువాత హత్యకు గురైందన విషయాన్ని కనిపెట్టారు. కాగా, శనివారం ఉదయం ఆమె మృతదేహాన్ని కాలువలో నుంచి బయటికి తీశామని పోలీసులు తెలిపారు. అయితే, తన కూతురిపై లైంగిక దాడి జరిగిందని, ఇందుకు సంబంధించిన ఆడియో సాక్ష్యం తమ వద్ద ఉందని బాధితురాలి తండ్రి చెబుతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios