‘శూర్పణఖ’ వ్యాఖ్యలపై ప్రధాని మోడీపై పరువునష్టం దావా వేయనున్న రేణుకా చౌదరి..
కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ప్రధాని నరేంద్ర మోడీపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రధాని తనను పార్లమెంట్ లో ‘శూర్పణఖ’తో పోల్చారని, దీనిపై తాను కోర్టుకు వెళ్లనున్నట్టు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలకు పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలారు. ఈ నేపథ్యంలో 2018లో పార్లమెంటులో చేసిన 'శూర్పణఖ' వ్యాఖ్యలపై ప్రధానిపై కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి పరువునష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ పోస్టు ద్వారా స్పష్టం చేశారు. తాను ప్రధాని మోడీపై వేయబోతున్నానని, కోర్టు ఇప్పుడు ఎంత వేగంగా వ్యవహరిస్తుందో తీసుకుంటుందో చూద్దామని ఆమె ట్వీట్ చేశారు.
దారుణం... కుక్కను పొడిచి చంపిన వ్యక్తి.. యజమానితో వాకింగ్ వెడుతుండగా ఘటన..
ఆమె నవ్వును ‘రామాయణం’ సీరియల్ పాత్ర ‘శూర్పణఖ’తో ప్రధాని మోడీ పోల్చిన ఒక పాత వీడియోను రేణుక షేర్ చేశారు. ‘‘క్లాస్ లెస్ మెగాలోమానిక్ నన్ను హౌస్ ఫ్లోర్ లో శూర్పణఖ అని పిలిచారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తాను. ఇప్పుడు కోర్టులు ఎంత వేగంగా చర్యలు తీసుకుంటాయో చూద్దాం..’’ అని ఆమె ట్వీట్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు గురువారం రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వయనాడ్ లోక్ సభ ఎంపీగా ఉన్న ‘‘రాహుల్ గాంధీ దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది’’ అని వ్యాఖ్యలు చేశారు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్యకు స్టేజ్ 2 క్యాన్సర్.. జైలులో ఉన్న భర్త కోసం భావోద్వేగ ట్వీట్..
‘‘నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ... వారందరికీ మోడీని ఒక ఉమ్మడి ఇంటిపేరుగా ఎలా కలిగి ఉన్నారు? దొంగలందరికీ మోడీ అనే ఉమ్మడి ఇంటిపేరు ఎలా ఉంటుంది?’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేశారు. కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ 30 రోజుల్లోగా పై కోర్టులో అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. తీర్పు వెలువరించే సమయంలో కోర్టుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని న్యాయమూర్తికి తెలిపారు.
"ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛలో జోక్యం చేసుకోదు": అనురాగ్ ఠాకూర్
‘‘అవినీతికి వ్యతిరేకంగా పోరాడినందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పకూడదని ఎంచుకున్నారు. ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడినందుకు క్షమాపణలు చెప్పకూడదని ఎంచుకున్నారు. నిజం మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పకూడదని ఎంచుకున్నారు’’ అని కోర్టు తీర్పు తర్వాత రేణుకా చౌదరి ట్వీట్ చేశారు.