నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్యకు స్టేజ్ 2 క్యాన్సర్.. జైలులో ఉన్న భర్త కోసం భావోద్వేగ ట్వీట్..

పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూకు స్టేజ్ 2 క్యాన్సర్ బాధపడుతున్నారు. దీని నుంచి  ఉపశమనం పొందేందుకు ఆమె శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. ఆపరేషన్ కు వెళ్లే ముందు ఆమె తన భర్త కోసం ట్విట్టర్ లో భావోద్వేగ పోస్ట్ లు చేశారు. 

Navjot Singh Sidhu's wife has stage 2 cancer.. Emotional tweet for husband in jail..  ISR

పంజాబ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూకు స్టేజ్ 2 క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను 2 ఇన్వాసివ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని దానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని ఆమె ట్విట్టర్ పోస్టులో వెల్లడించారు. నవజ్యోత్ కౌర్ చికిత్స కోసం బుధవారం డేరాబస్సిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఈ ఆపరేషన్ నేపథ్యంలో ఆమె తన భర్త కోసం ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ రాశారు. 1988 రోడ్డు ప్రమాదం కేసులో ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. 

"ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛలో జోక్యం చేసుకోదు": అనురాగ్ ఠాకూర్

బహుశా తనకంటే ఎక్కువగా బాధపడే తన భర్త కోసం ఎదురుచూస్తున్నానని నవజ్యోత్ కౌర్ ట్వీట్ చేశారు. “నా భర్త నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేయని నేరానికి జైలు పాలయ్యాడు. నేరంలో పాల్గొన్న వారందరినీ క్షమించండి. ప్రతిరోజూ నీ కోసం ఎదురుచూడటం నీకంటే ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఎప్పటిలాగే మీ బాధను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, దానిని పంచుకోమని అడిగారు. చిన్న ఎదుగుదల చూడడం జరిగింది, అది చెడ్డదని తెలిసింది.’’ అని పేర్కొన్నారు. 

నవజ్యోత్ కౌర్ సిద్ధూ తన రెండో ట్వీట్ లో..‘‘నీ కోసం ఎదురుచూశాను, నీకు పదేపదే న్యాయం నిరాకరించబడటం చూశాను. కానీ సత్యం చాలా శక్తివంతమైనది. కానీ అది మిమ్మల్ని మళ్లీ మళ్లీ పరీక్షిస్తుంది. కలియుగ్. క్షమించండి. ఇది స్టేజ్ 2 క్యాన్సర్ కాబట్టి మీ కోసం వేచి ఉండలేను. భగవంతుడు ఇచ్చినది కాబట్టి ఎవరినీ నిందించకూడదు. దేవుడు నీకు సరిగ్గానే ఆలోచిస్తాడు.’’ అని పోస్ట్ చేశారు. 

అమృత్‌పాల్ సింగ్ ఫొటోలో ఉన్నట్టుగా లేడు.. రూపం మార్చుకున్నాడు, తలపాగా తీసేశాడు : బల్జీత్ కౌర్

నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఆమెకు చికిత్స చేయించేందుకు డేరాబస్సిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త నిర్దోషి అని రుజువు చేసి, శిక్ష మాఫీ అయ్యేలా చూడాలని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ను కోరారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏప్రిల్ 1 నాటికి జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తన భర్త సిద్ధూ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మునుపటిలా పంజాబ్ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటారని అన్నారు.

ఆ దేశం నుండి ప్రజాస్వామ్యం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు: భారతదేశం

1988 నాటి రోడ్డు ప్రమాదం కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూకు 2022 మే 19న ఏడాది జైలు శిక్ష పడింది. ఆ రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. కాగా..  పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సిద్ధూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పార్టీ చర్యలను ఎదుర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios