దీపావళిలోపు పెండింగ్ జీతాలు విడుదల చేయాలని పీఎం ప్యాకేజీ కింద నియామకం అయిన కాశ్మీర్ పండిట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అలాగే తమ విధులను కాశ్మీర్ కు మార్చాలని కోరారు. 

ఈ ఏడాది మే 12న మిలిటెంట్ల చేతిలో పండిట్ ఉద్యోగిని హతమార్చినప్పటి నుంచి లోయలో విధుల్లో చేరని దాదాపు 5000 మంది పీఎం ప్యాకేజీ కాశ్మీరీ పండిట్ ఉద్యోగులు, తమకు ఆపేసిన జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీపావళికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉందని ఆ లోపు పెండింగ్ జీతాలను చెల్లించాలని కోరారు. అలాగే తమ మకాంను మిలిటెన్సీ పీడిత కాశ్మీర్ నుండి జమ్మూకి మార్చాలని కోరారు. 

లేడీ ఖిలాడీ.. అపార్ట్‌మెంట్‌లో గది అద్దాలను బయటి నుంచి క్లీన్ చేసిన మహిళ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

“చాలా మంది పీఎం ప్యాకేజీ ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. దాదాపు 20-30 శాతం మంది ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా జీతాలు అందలేదు” అని ఆల్ మైగ్రెంట్ డిస్‌ప్లేస్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాశ్మీర్ (AMDEAK) అధ్యక్షుడు రూబోన్ సప్రూ ‘టీఎన్ఐఈ’కి తెలిపారు. పండుగకు మిఠాయిలు, క్రాకర్లు కొనడానికి తమ వద్ద డబ్బు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలను విడుదల చేస్తే ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా దీపావళి పండగ జరుపుకుంటారని తెలిపారు. తామే లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. తమకు లోయలో భద్రత లేదని, కాబట్టి తమను జమ్మూకి తరలించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే బయోమెట్రిక్ హాజరు నుంచి ప్రభుత్వం మినహాయించాలని అన్నారు.

హాఫ్ హెల్మెట్ ధరించినందుకు ఓ పోలీసుకు మరో పోలీసు ఫైన్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్..

ఈ సందర్భంగా ఏఎండీఈఏకే వైస్ ప్రెసిడెంట్ రంజన్ జోత్షి మాట్లాడుతూ... జమ్మూకి తరలించడం తమ ప్రధాన డిమాండ్ అని, ఆ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని అన్నారు. “నిరంతర లక్ష్యంగా హత్యలు జరుగుతున్న దృష్ట్యా మేము లోయలో సేవ చేయలేము. లోయలో పరిస్థితి మెరుగుపడే వరకు ప్రభుత్వం మమ్మల్ని కాశ్మీర్ వెలుపలకు తాత్కాలికంగా తరలించాలి. కాశ్మీర్ వెలుపల పునరావాసం చేయాలనే మా డిమాండ్‌పై ఎలాంటి రాజీ ఉండదు” అని ఆయన అన్నారు. నిరసనకారులతో ప్రభుత్వం చర్చలు జరిపిందా అని మీడియా అడిగి ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. “ లేదు.. కానీ జమ్మూ కాశ్మీర్ బీజేపీ యూనిట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో పీఎం ప్యాకేజీ ఉద్యోగులు కూడా సభ్యులుగా ఉంటారు. వారు లెఫ్టినెంట్ గవర్నర్‌తో మా సమావేశాన్ని సులభతరం చేస్తారు.’’ అని పేర్కొన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్.. స్పాట్‌కు రెస్క్యూ టీమ్!

2010 నుండి జమ్మూ కాశ్మీర్ లో పీఎం ప్యాకేజీ కింద నియమితులైన సుమారు 5000 మంది పండిట్ ఉద్యోగులు లోయలో మే 12 నుండి తమ విధులకు హాజరుకావడం లేదు. అదే రోజు కాశ్మీరీ పండిట్ అయిన ఉద్యోగి రాహుల్ భట్‌ను సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో టెహసీల్ కార్యాలయం లోపల ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో అప్పటి నుంచి చాలా మంది పండిట్ పీఎం ప్యాకేజీ ఉద్యోగులు లోయను వదిలి జమ్మూలో ఉంటున్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులు జమ్మూలోని రిలీఫ్ కమీషనర్ కార్యాలయం వెలుపల ప్రతిరోజూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇటీవల షోపియాన్‌లో మిలిటెంట్లు ఒక పండిట్ రైతు, ఇద్దరు వలస కూలీలను చంపిన తర్వాత వారిలో మరింత భయం పట్టుకుంది.