Asianet News TeluguAsianet News Telugu

లేడీ ఖిలాడీ.. అపార్ట్‌మెంట్‌లో గది అద్దాలను బయటి నుంచి క్లీన్ చేసిన మహిళ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

దీపావళి సందర్భంగా ఇంటిని శుభ్రపరచడం, రంగులు వేయడం సాధారణంగా కనిపించే దృశ్యాలే. కానీ, ఓ వీడియోలో ఒక మహిళ నాలుగో అంతస్తులోని తమ ఇంటి అద్దాలను ఎలాంటి సహకారం లేకుండా బయటి నుంచి క్లీన్ చేసింది. ఆ వీడియో చూసి నెటిజన్లు స్తానువై పోయారు.
 

woman daredevil cleans window from outside of their home which was in fourth floor of the apartment
Author
First Published Oct 21, 2022, 1:51 PM IST

న్యూఢిల్లీ: దీపావళి వచ్చిందంటే సందడి మొదలవుతుంది. ముఖ్యంగా దసరా తర్వాతి నుంచే ఇంటిని శుభ్రం చేసే పనులు మొదలు పెడతారు. ఇంటికి కొత్త రంగులు వేసుకుంటారు. ముఖ్యంగానైతే ఇల్లు అంతా క్లీన్ చేస్తారు. ఇది దేశమంతటా సర్వసాధారణంగా దీపావళికి చేసే సన్నద్ధతలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ ఇంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఓ మహిళ ఇంటి కిటికీలు శ్రద్ధగా శుభ్రం చేస్తూ కనిపించింది. ఇందులో వింతేమి ఉన్నది అనే కదా మీ డౌటు. వారి ఇల్లు అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తులో ఉన్నది. ఆమె ఆ ఇంటి కిటికీ అద్దాలను బయట నుంచి క్లీన్ చేసింది. అది కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా కిటికీ సన్నటి అంచులపై నిలబడి ఓ గుడ్డతో సులువుగా తుడవడం కనిపించింది. ఆ మహిళా నిజంగానే ఓ సాహసాన్ని చాలా సునాయసంగా చేసేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది. పది లక్షలకు మించి వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోకు తగినట్టుగానే కామెంట్లు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చాయి. 

Also Read: పాన్ షాప్ ముందటి బల్బ్ దొంగిలించిన నైట్ డ్యూటీలోని పోలీసు.. వీడియో వైరల్..పోలీసుపై యాక్షన్

ఈ స్టంట్లు కేవలం నిపుణులు మాత్రమే వేస్తారు. మీ ఇంటి వద్ద ఇలాంటి సాహసాలు చేయకండి అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. ఇంకొకరు ఈ వీడియో చూసి తన గుండె కొట్టుకోవడం కాసేపు ఆగిపోయిందని పేర్కొన్నారు. అసలు ఆ పని నిజంగానే ఓనర్ చేసుకుంటున్నదా? లేక ఓ పేద ఇంటి పనిమనిషి ప్రాణాలు తెగించేలా ఓనర్ ఆదేశించిందా? అనే అనుమానం వ్యక్తం చేశారు మరొక యూజర్. ఇంతా చేసినా ఈ ఖత్రోన్ కా ఖిలాడీకి క్లీనింగ్ తర్వాత గతేడాది పొందన సోన్ పాప్డీనే మళ్లీ పొందుతారు అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఈ వీడియో తొలుత ఫిబ్రవరిలో వైరల్ అయింది. ఘజియాబాద్‌లోని ఓ సొసైటీలో ఈ ఘటన జరిగినట్టు తలెుస్తున్నది.

ఆ సొసైటీ నివాసులు ఈ దృశ్యాన్ని చూడగానే బెంబేలెత్తిపోయారు. వెంటనే ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. క్లీనింగ్ చేయడం కోసం తన ప్రాణాలను ముప్పులో వేసుకోవద్దని సూచనలు ఇచ్చినట్టు ఆంగ్ల మీడియా సంస్థ ఎన్డీటీవీ పేర్కొంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios