గుజరాత్‌లోని వడోదరాలో ఓ పాఠశాల బాత్‌రూమ్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి హత్యకు గురైన ఘటన సంచలనం కలిగించింది. ఈ దారుణం వెనుక మిస్టరీని పోలీసులు చేధించారు. క్లాస్ టీచర్ ఇచ్చిన హోమ్ వర్క్ చేయని ఓ విద్యార్థి.. స్కూలుకు సెలవు ఇస్తే దాని నుంచి తప్పించుకోవచ్చన్న ఉద్దేశ్యంతో బాలుడిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

బారన్‌పూర్ ప్రాంతంలోని భారతి స్కూల్‌లో భగవాన్ దాస్ తాడ్వి అనే విద్యార్థి మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది.. బాలుడి శరీరంపై 10 కత్తిపోట్లు వున్నాయి.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. భోజన విరామం తర్వాత తాడ్వి తన తరగతి గదికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు.. స్కూలు పక్కనే ఉన్న దేవాలయం వద్ద లభించిన ఓ బ్యాగులో పదునైన ఆయుధాలు, కారం నీళ్లతో కూడిన సీసాను పోలీసులు గుర్తించారు.

నిందితుడిని ఓ టెన్త్ విద్యార్థిగా గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టి..నిన్న రాత్రి దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్ పట్టణంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు..మైనర్ బాలుడు కావడంతో అతనని  బాల నేరస్థుల శిక్షణాలయానికి తరలించారు. కాగా, ఈ కేసులో పోస్ట్‌మార్టం రిపోర్టు ఇంకా రాలేదని పోలీసులు వెల్లడించారు.. అతని మానసిక స్థితిపై వైద్యులు పరీక్షలు చేస్తున్నారు..