‘ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమే.. కానీ ఓ కండీషన్’- కేజ్రీవాల్ ఆహ్వానాన్ని అంగీకరించిన హిమంత బిశ్వ శర్మ..

ఢిల్లీ సీఎం ఆహ్వానాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అంగీకరించారు. ఢిల్లీకి రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కానీ ఓ షరతు విధించారు. 

Ready to go to Delhi.. but one condition- Himanta Biswa Sharma accepted Kejriwal's invitation..ISR

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్సాం సీఎంను దేశ రాజధానికి ఆహ్వానించిన కొన్ని గంటల తరువాత హిమంత బిశ్వ శర్మ దానికి అంగీకారం తెలిపారు. కానీ ఓ కండీషన్ విధించారు. శనివారం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అస్సాంలో పర్యటించారు. ఆ సమయంలో హిమంత బిశ్వ శర్మను ఢిల్లీకి రావాలని కోరారు. నగరం చుట్టూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం చేసిన అద్భుతమైన పనిని చూపిస్తానని చెప్పారు.

అప్పీల్ కోసం దోషి వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇదంతా నాటకం: రాహుల్‌పై కిరణ్ రిజిజు విమర్శలు..

‘‘ఢిల్లీలోని మా ఇంటికి వచ్చి టీ తాగమని హిమంతబాబును ఆహ్వానిస్తున్నాను. ఆయనకు సమయం ఉంటే నాతో కలిసి భోజనం కూడా చేయాల్సిందిగా కోరుతున్నాను.  నగరం చుట్టూ అక్కడ మేము చేసిన అద్భుతమైన పనిని నేను ఆయనకు చూపిస్తాను’’ అని కేజ్రీవాల్ గౌహతిలో జరిగిన ర్యాలీలో అన్నారు.

ఈ ఆహ్వానానికి హిమంత బిశ్వ శర్మ ఆదివారం అంగీకరిస్తూ.. తాను అసోం నుంచి 50 మందిని పంపుతానని అన్నారు. అందులో ఎక్కువగా జర్నలిస్టులు ఉంటారని, కేజ్రీవాల్ వారిని ఢిల్లీ చుట్టూ తీసుకెళ్లాలని అన్నారు. ‘‘ అయితే ఒకటే షరతు. ఆయన ఏం చూపించాలనుకుంటున్నారో కాదు.. మేము చూడాలనుకున్న ప్రదేశాలకు తీసుకెళ్లాలి’’ అని అన్నారు. ‘‘ఢిల్లీలో 60 శాతం మంది నరకం అనుభవిస్తున్నారు. దీనికి విరుద్ధంగా అస్సాంలో 95 శాతం స్వర్గంలో నివసిస్తున్నారు’’ అని బిశ్వ శర్మ తెలిపారు.

నేడు సోదరితో కలిసి సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ.. పరువు నష్టం కేసులో పిటిషన్...

గౌహతి ర్యాలీలో ఆప్ అధినేత చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కేజ్రీవాల్ పిరికివాడని, ఆయన 'హీరోయిజం' అసెంబ్లీకే పరిమితమైందని విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆయన తనపై అవినీతి ఆరోపణలు చేశారని, అయితే అక్కడ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునేందుకు నిబంధనలు రక్షణగా నిలుస్తున్నాయని అన్నారు. అవే ఆరోపణలను సభ వెలుపల పునరావృతం చేస్తే, వాటిని కోర్టులో సవాల్ చేస్తానని చెప్పానని, కానీ ఇక్కడ మాట్లాడే ధైర్యం ఆయనకు లేదని విమర్శించారు.

ఢిల్లీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై శర్మ స్పందిస్తూ.. ఈ గణాంకాలు తప్పు అని, దేశ రాజధానిలో 60 శాతం మంది పౌరులు నరకం అనుభవిస్తున్నారని అన్నారు. ‘‘ఢిల్లీలో అధికారులతో మాట్లాడాను. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 1.50 లక్షల పోస్టులు మంజూరయ్యాయని చెప్పారు. ఉద్యోగాల విభజన కోసం రేపు కేజ్రీవాల్ కు లేఖ రాస్తానని, తమ ప్రభుత్వం కల్పించిన ఉపాధి వివరాలను కూడా వెల్లడిస్తానని అన్నారు.’’

నమ్మిన వారికి రూ .40 కోట్ల టోకరా వేసిన పోలీస్ బ్రదర్స్.. ఆన్ లైన్ వ్యాపారం పేరుతో మోసం...

అస్సాంలో ఆప్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామన్న కేజ్రీవాల్ హామీని ఆయన తోసిపుచ్చారు. ఈశాన్య రాష్ట్రంలో 'ఒరునుడోయ్' పథకం ఉందని, దీని కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.1,400 జమ చేస్తుందని ఆయన అన్నారు. అస్సాంలో ఇటీవల ప్రశ్నాపత్రం లీకేజీపై కేజ్రీవాల్ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలపై స్పందించిన శర్మ, ఆప్ ప్రభుత్వం ఉన్న పంజాబ్ లో 12వ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయిందని, పరీక్షను రద్దు చేశారని పేర్కొన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios