నమ్మిన వారికి రూ .40 కోట్ల టోకరా వేసిన పోలీస్ బ్రదర్స్.. ఆన్ లైన్ వ్యాపారం పేరుతో మోసం...

ఆన్లైన్ వ్యాపారం పేరుతో తమ సహచరులకే కుచ్చుటోపీ వేశారు పోలీస్ బ్రదర్స్. తమ కుటుంబంతో కలిసి బంధువులు, స్నేహితులు, కొలిగ్స్ దగ్గర రూ.40 కోట్లు కొట్టేశారు. 

fraud in the name of online bussiness, including two police 8 family members arrested in chennai - bsb

చెన్నై : వారిద్దరూ అన్నదమ్ములు. పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఓ విద్యాశాఖ అధికారి కూడా వీరి సోదరుడే. ఈ ముగ్గురూ కలిసి తమతో పని చేస్తున్న వారిని బురిడీ కొట్టించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.40 కోట్లు  మోసానికి పాల్పడ్డారు. ఆన్లైన్ వర్తకం పేరుతో వీరి చేతుల్లో మోసపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం ఈ కుటుంబంలో వీరి ముగ్గురితో పాటు 8 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. జోషఫ్, మరియా సెల్వి దంపతులు. 

వీరు కాంచీపురం జిల్లా ఏనాత్తూరు పుదునగర్ వాసులు.  వీరికి ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురు కొడుకుల్లో ఒకరు విద్యాశాఖలో పనిచేస్తున్నాడు. సహాయభారత్, ఆరోగ్య అరుణ్ అనే మరో ఇద్దరు పోలీసులు. కాంచీపురం ట్రాఫిక్ పోలీస్ శాఖలో ఒకరు.. మహాబలిపురం  క్రైమ్ డిపార్ట్మెంట్లో మరొకరు పనిచేస్తున్నారు. .కాగా వీరిద్దరితోపాటు కుటుంబం మొత్తం పార్ట్ టైం జాబ్ గా ఆన్లైన్ వ్యాపారం, పెట్టుబడులు అని ఓ వ్యవహారానికి తెరలేపారు. ఈ ఆన్లైన్ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే.. ఆదాయం రెట్టింపు వస్తుందంటూ ప్రచారం చేశారు. 

బాబోయ్.. ఇష్టంగా తిన్న చేపలకూరే ప్రాణాలు తీసింది.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం..

ఇక అన్నాదమ్ములు తమతో పాటు ఉద్యోగం చేసే వారిని,  బంధువులను, ఇరుగుపొరుగు వారిని నమ్మించారు. వారిచేత ఈ ఆన్లైన్ వ్యాపారంలో రూ.40కోట్లు పెట్టుబడులు పెట్టించారు. పెట్టుబడులైతే పెట్టారు కానీ దానికి సంబంధించిన వివరాలు ఏవి.. డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తారు ఇలాంటి సమాచారం ఏది ఈ పోలీస్ బ్రదర్స్ కానీ, వారి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికీ చెప్పలేదు. దీంతో.. కొద్ది కాలం గడిచిన తర్వాత పెట్టుబడులు పెట్టిన మిగతా పోలీసులు.. విద్యాశాఖలో పనిచేస్తున్న వారు ఆ అన్నదమ్ములను నిలదీశారు. దీంతో వారంతా పత్తా లేకుండా పోయారు.  

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు బాధితులు. వీరి ఫిర్యాదు మేరకు  పోలీసు ఉన్నతాధికారులు ఆ అన్నదమ్ముల మీద దర్యాప్తుకు ఆదేశించారు. విచారణ చేసిన కాంచీపురం పోలీసులు బాధితుల ఆగ్రహం వాస్తవమేనని తేల్చడంతో.. ఆ పోలీస్ బ్రదర్స్ కుటుంబంలోని ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు చేసిన వారిలో పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇద్దరు అన్నదమ్ములతోపాటు, విద్యాశాఖలో అధికారిగా పనిచేస్తున్న  సోదరుడు, ఆ ముగ్గురు అన్నదమ్ముల తల్లిదండ్రులు.. వారి భార్యలు  మహాలక్ష్మి, జయశ్రీ, సమీయా  ఉన్నారు. 

ఇక, మధురై ఉసిలం పట్టిలో ఆన్లైన్ వర్తకంలో పెట్టుబడి పెట్టి.. నష్టాలు రావడంతో ఓ ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. జగదీష్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఉసిలం పట్టికి చెందిన అతను.. కోయంబత్తూరులో పనిచేస్తున్నాడు.  అతనికి వివాహమయ్యింది. భార్య మణిమాలతోపాటు.. ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. ఆన్లైన్ వ్యాపారం అంటే జగదీష్ కు చాలా ఉత్సాహం. ఈ క్రమంలోనే తన దగ్గర దాచిపెట్టుకున్న నగదు, భార్య నగలు ఆన్లైన్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి రావడంతో సన్నిహితులు, బంధువులు, మిత్రుల దగ్గర అందిన కాడికి అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టాడు.  

కానీ ఆన్లైన్ వ్యాపారంలో నష్టాలు ఎదురు చూడాల్సి వచ్చింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. నష్టాల నుంచి ఎలా తేరుకోవాలో తెలియక అతడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios