నేడు సోదరితో కలిసి సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ.. పరువు నష్టం కేసులో పిటిషన్...

పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ సూరత్ కోర్టులో నేడు రాహుల్ గాంధీ అప్పీల్ చేయనున్నారు. సోదరి ప్రియాంక గాంధితో కలిసి కోర్టుకు హాజరుకానున్నారు. 

Rahul Gandhi to Surat court today to appeal against defamation case - bsb

న్యూఢిల్లీ : 2019 నాటి పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం నాడు గుజరాత్ లోని సూరత్ కోర్టును ఆశ్రయించనున్నారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కోర్టు ఈ కేసు మీద రాహుల్ గాంధీ అప్పీల్ కు వెళ్లేందుకు నెలరోజుల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఈరోజు అప్పీల్ కు వెళ్ళనున్నారు. 

సోమవారం మధ్యాహ్నం సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ అభ్యర్థన పిటిషన్ ను దాఖలు చేయనున్నారు. ఆయన అప్పీలులో పరువు నష్టం కేసులో మెజిస్ట్రేట్ విధించిన శిక్షను పక్కన పెట్టాలని కోరనున్నారు. ఈ శిక్ష మీద తాత్కాలిక స్టే ఇవ్వాలని దీని ద్వారా లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోగలిగే అవకాశం తనకు దక్కుతుందని ఈ అప్పీల్ పిటిషన్ లో రాహుల్ గాంధీ కోరే అవకాశం కనిపిస్తోంది.సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి, పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన సూరత్ కోర్టుకు హాజరు కానున్నారని సమాచారం. దీనికి ముందు ఆదివారం నాడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియాగాంధీని కలిశారు.  ఈ సమయంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. 

ఐఐటీ-మద్రాస్ లో పీహెచ్ డీ విద్యార్థి ఆత్మహత్య.. చనిపోయేముందు వాట్సాప్ స్టేటస్ ఏంటంటే...

ఇదిలా ఉండగా.. రాహుల్ గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఘటన జరిగింది. ఎన్నికకల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలారులో ర్యాలీ జరిగింది. ఆ ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..  మోదీ అనే ఇంటిపేరున్న వారందరూ దొంగలే అన్నట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడారు. అలా మాట్లాడుతూ ఆయన.. ‘‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?’’ అని ప్రశ్నించారు. 

దీన్ని బీజేపీ శ్రేణులు సీరియస్ గా తీసుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ.. కోర్టును ఆశ్రయించారు. సూరత్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించారు. రెండేళ్ల జైలు శిక్ష విధించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios