Asianet News TeluguAsianet News Telugu

రాముడి కంటే రావణుడే గొప్పవాడు - బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ

రాముడి కంటే రావణుడే గొప్పవాడని బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత జితన్ రామ్ మాంఝీ అన్నారు. రామయణం కల్పితమని తెలిపారు. ఈ విషయం తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని తెలిపారు. బీహార్ విధానసభ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Ravana is greater than Ram - Former Bihar CM Jitan Ram Manjhi
Author
First Published Mar 17, 2023, 4:01 PM IST

రామచరిత మానస్, రామాయణంపై వ్యాఖ్యలు చేయడంలో బీహార్ మహాకూటమిలో ప్రధాన భాగస్వామి అయిన ఆర్జేడీ ముందంజలో ఉండగా.. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ ఆ విషయంపై మాట్లాడి ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. రామాయణం ఊహాజనితమని, రాముడి కంటే రావణుడు గొప్పవాడని ఆయన అభివర్ణించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం లో మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు: తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

బీహార్ విధానసభ ఆవరణలో శుక్రవారం మాంఝీ మీడియాతో మాట్లాడారు. ‘‘రాముడి కంటే రావణుడి పాత్ర చాలా పెద్దది. రాముడి కంటే రావణుడి పనులు పెద్దవి. రాముడు, రావణుడి గురించి ఊహాగానాలతో మాట్లాడే బదులు పేదల గురించి బీజేపీ నేతలు మాట్లాడటం మంచిది’’ అని అన్నారు.  పురాణ కవులు వాల్మీకి, గోస్వామి తులసిదాసులపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన..రామాయణం, రామచరిత మానస్ లో రాసిన అనేక తప్పుడు విషయాలను తొలగించాలని అన్నారు. 

రామాయణం కల్పితమని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని జితన్ రామ్ మాంఝీ అన్నారు. రాముడు, రావణుడు ఇద్దరూ కల్పితం. కానీ ఊహల ఆధారంగా వచ్చిన కథ ప్రకారం రాముడి కంటే రావణుడు పెద్దవాడని తాను నమ్ముతానని తెలిపారు. రాముడు కష్టాల్లో ఉన్నప్పుడు, అతీంద్రియ సేవలు అతనికి సహాయపడ్డాయని, కానీ రావణుడి కోసం ఏమీ రాలేదని చెప్పారు.

గర్ల్‌ఫ్రెండ్‌ను ఆమె భర్త దగ్గర నుంచి తెచ్చి తనకు అప్పగించాలని లవర్ పిటిషన్.. హైకోర్టు తీర్పు ఇదే

రాముడు ఊహాజనిత పాత్ర అని డిస్కవరీ ఆఫ్ ఇండియాలో చెప్పారని బీహార్ మాజీ సీఎం గుర్తు చేశారు. లోకమాన్య తిలక్, రాహుల్ సాంకృత్యాయన్ కూడా రాముడు ఊహాజనితమని చెప్పారని అన్నారు. అనంతరం ఆయన తులసీదాస్, వాల్మీకి మధ్య ఉన్న పోలికలను వివరించాడు. వాల్మీకి రామాయణం రచించారని, కానీ ఆయనను ఎందుకు పూజించరని ప్రశ్నించారు. తులసీ దాసుని మాత్రమే ఎందుకు పూజిస్తారని అన్నారు. ఇది మనువాద వ్యవస్థ వల్ల జరిగిందని మాంఝీ తెలిపారు. తులసీదాస్ రామ్‌చరిత్ మానస్‌లో చాలా మంచి విషయాలతో పాటు చాలా తప్పులు ఉన్నాయని అన్నారు. బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్, లోహియా కూడా అందులోని చెత్తను తొలగించాలని చెప్పారని గుర్తు చేశారు.

అన్ని మదర్సాలకు తాళాలు వేయాలన్నదే నా సంకల్పం - అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

గతంలో  కూడా జితన్ రామ్ మాంఝీ హిందూ మతంపై, శ్రీరాముడి వివాదాస్పద ప్రకటనలు చేశారు. రామాయణం, శ్రీరాముడి ఉనికిని ప్రశ్నించారు. సత్య నారాయణ పూజను దళితులు నిర్వహించకూడదని అన్నారు. బ్రాహ్మణులపై కూడా ఒక సారి వివాదాస్పద ప్రకటన చేశారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సంక్రాంతి సందర్భంగా బ్రాహ్మణ విందు ఏర్పాటు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios