ఎటిఎంలోని రూ.12 లక్షలు కాజేసిన ఎలుకలు!

Rats Ate Rs. 12 Lakh Notes In ATM
Highlights

ఏటిఎంలో ఎలుకలు పడ్డాయి. డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి. అందుకే ఎలుకలు ఓ ఏటిఎం మీద కన్నేశాయి.

ఏటిఎంలో ఎలుకలు పడ్డాయి. డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి. అందుకే ఎలుకలు ఓ ఏటిఎం మీద కన్నేశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 లక్షల రూపాయల్ని కాజేశాయి. అస్సాంలోని ఓ స్టేట్ బ్యాంక్ ఏటిఎంలో ఎలుకలు దూరి రూ.12 లక్షల విలువైన కరెన్సీ నోట్లని చించివేశాయి. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో బాగా పాపులర్ అయ్యింది.

ఏటిఎం మెషీన్‌లో రూ.12 లక్షల డబ్బు ఉన్నప్పటికీ, కస్టమర్లు డెబిట్ కార్డు ద్వారా విత్‌డ్రా బయటకు రాకపోవడంతో వారు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న టెక్నీషియన్లు మెషీన్ ఓపెన్ చూసిచూడగానే అవాక్కయ్యారు. మెషీన్ నిండా చిరిగిపోయిన కరెన్సీ నోట్లు కనిపించాయి. చిరిగిన నోట్ల మధ్యలో ఓ చనిపోయిన ఎలుక కూడా ఉంది. ఏటిఎం మెషీన్ వెనుక వైర్ల దగ్గరున్న రంధ్రం గుండా ఎలుకలు ప్రవేశించి ఉంటాయని భావిస్తున్నారు.

loader