Asianet News TeluguAsianet News Telugu

రసూలుల్లా వారసులు సగం భారతీయులే.. వారిలో ఇదే రక్తం

రసూలుల్లా వారసులు రక్తం ఆధారంగా సగం భారతీయులు. అల్లా పంపిన సందేశకుడి మనవడు ఇమామ్ హుస్సేన్. ఆయన కొడుకు ఇమామ్ జైనుల్ అబీదిన్. అబీదిన్ తల్లి ఒక సింధ్ మహిళ.
 

raoolullah descendantts are half indians by blood, she is a sindhi woman kms
Author
First Published Sep 29, 2023, 3:19 PM IST

న్యూఢిల్లీ: అల్లా పంపిన సందేశకుడి మనవడు ఇమామ్ హుస్సేన్. ఈయన కొడుకే ఇమామ్ జైనుల్ అబీదిన్. విశ్వసనీయ చారిత్రక రచనల ప్రకారం ఇమామ్ జైనుల్ అబీదిన్ తల్లి ఒక సింధీ మహిళ. ఈ విషయంపై ఇమామ్ ఇబన్ ఖుతిబా కితాబ్ అల్ మారిఫ్ అనే పుస్తకంలో సమాచారం ఇచ్చారు.

ఇమామ్ హుస్సేన్‌ను సయ్యద్‌ల వారసుడిగా ముస్లింలు చెబుతుంటారు. అరబ్ ఇండియన్ రిలేషన్ అనే ప్రసిద్ధ పుస్తకంలో సయ్యద్‌లను సగం భారతీయులని వర్ణిస్తారు భారత పరిశోధకుడు సయ్యద్ సులేమన్ నద్వి. సయ్యద్‌లు ఎల్లప్పుడూ సగం భారతీయులు అని, మిగిలిన ముస్లింలు సగం భారతీయులు కావొచ్చు, కాకపోవచ్చని ఆయన వివరిస్తారు.

మహమ్మద్ ప్రవక్త హడిత్‌లో భారత్ నుంచి చల్లని సుగంధ పరిమళాలు వస్తున్నాయని ఇందుకే చెప్పారని అంటారు. హజ్రత్ అలీ ఇంకా ఏమంటారంటే.. ఇండియా అనే భూమి సువాసనలకు ప్రసిద్ధి చెందినదని చెబుతారు. ఇక్కడే పరిమళాల స్వర్గపు మొక్కను నాటారని వివరిస్తారు. సయదానా ఆదామ్‌ను ఇండియాకు పంపించారు. ఇండియాతో ప్రవక్తకు ఉన్న దగ్గరి సంబంధం దీనికే పరిమితమైపోదు. ఒక హడిత్‌లో ఆదామ్‌న ఇండియా ప్రాంతానికి పంపించినట్టు ఆయన చెప్పారు.

సయ్యద్ సులేమాన్ నద్వి ప్రకారం, హజ్రత్ ఆదామ్ ఆకాశం నుంచి ఇండియా అనే స్వర్గానికి తీసుకురాబడ్డాడు. ఇలాంటి అనేక సంబంధాలు మనకు చరిత్రలో కనిపిస్తాయి. ఉదాహరణకు ఇందులో హజ్రత్ ఉత్తమాన్ బిన్ అబీ అల్‌ను థకాఫీ రూపంలో, హజ్రత్ హుఖామ్ బిన్ అబీ అల్‌నున హజ్రత్ ముఘీరాగా, హజ్రత్ రాబి‌ని బిన్ జాయద్‌గా హజ్రత్ అబ్దుల్లా అన్సారీ, హజ్రత్ ఉమేర్ బిన్ ఉస్మాన్, హజ్రత్ ఆసిమ్ బిన్ ఉమర్ సహా పలువురు భారత్ పర్యటించారు. వీరు మహమ్మద్ ప్రవక్త బోధనలను ప్రచారం చేశారు. 

ప్రవక్త సన్నిహిత మిత్రుడు హజ్రత్ ఉమర్‌ను ఖలీఫాగా ఎన్నుకున్న తర్వాత ఆయన భారత్‌కు వెళ్లుతున్న ఓ పర్యాటకుడిని ఇండియా గురించి ఏమనుకుంటున్నావని అడిగారు. ఆ పర్యాటకుడు ఏమన్నాడంటే.. ఇండియా పర్వతాలు రత్నాలు, అక్కడి నదులు ముత్యాలు, ఆ ప్రాంత వృక్షాలు సుగంధాలు అని వివరించాడు.

Also Read: మతం ద్వారా సమైక్యతకు మసీదులో భోజనం.. హైదరాబాద్ నుంచి 20కిపైగా మసీదుల సమ్మతి

పెద్దల ప్రకారం అరబ్‌లో అనేకులు భారత సెట్లర్లు ఉండేవారు. ప్రవక్త వారిని నబూవత్‌గా ప్రకటించారు. ఆ సమయంలో అక్కడ ఇండియన్లు మంచిగా స్థిరపడ్డారు. భారత తల్వార్లు ప్రసిద్ధిగాంచినవి. అలాగే అనేక భారత సరుకులు అరేబియాకు వచ్చేవి. అల్బా పోర్ట్‌ను ఒక మనీ ఇండియా అని సయ్యద్ సులేమన్ నద్వి చెప్పారు. అంతలా సరుకులు పోర్టుకు వచ్చేవి.

టేకు కలప, తల్వార్లు, పత్తి, పట్టు వస్త్రాలు, నిమ్మకాయలు, బత్తాయిలు, అరటి పండ్లు, ఇలాచీ, లవంగాలు, రత్నాలు, ముత్యాలు, ఇంకా అనేక ఇతర వస్తువులు ఇండియా నుంచి అరేబియాకు ఎగుమతి అయ్యేవి.  ఖాజీ అథార్ ముబారక్‌పురి, సయ్యద్ సులేమన్ నద్వి, అక్బర్ అలీ ఖాన్ ఖాద్రీ, గుస్తావ్ లీ బాన్ వంటి ప్రముఖలు రచనలు ప్రవక్త కాలంలో అరబ్‌కు, ఇండియాకు మధ్యగల సత్సంబంధాలను వెల్లడిస్తాయి.

బహుశా ఈ కారణంగానే ఇతర చరిత్రకారులకు భిన్నంగా హజ్రత్ జైన అల్ అబీదిన్ తల్లి భారతీయురాలని ఇబన్ ఖుతీబా చెబుతారు. అనేక మంది సూఫీలు ఆ సమయంలో దేవుడు పంపిన సందేశాలను భారత సమాజాల్లో ప్రచారం చేశారు. వారు ఇండియాకు వచ్చి.. ఇండియానే ఇంటిగా మార్చుకున్నారు.

వేయ్యేళ్లకు ముందే కితాబ్ అల్ హింద్ అనే పుస్తకంలో హిందూ మత గ్రంథాలను అల్ బైరుని పరిశీలించారు. అందులో చాలా వరకు బోధనలు ఇస్లామిక్ బోధనలను పోలి ఉన్నట్టు వివరించారు. సూఫీలు, విద్యావేత్తలు పెద్ద మొత్తంలో పాటించే సంప్రదాయాలు అల్లా మెసేంజర్ చెప్పే బోధనలకు దగ్గరగా ఉన్నాయి. అందుకే భారత్‌లో ఇప్పటికీ ఇస్లాం ప్రధానమైన విశ్వాసంగా కొనసాగుతున్నది.

----సయ్యద్ తలీఫ్ హైదర్

Follow Us:
Download App:
  • android
  • ios