Asianet News TeluguAsianet News Telugu

మతం ద్వారా సమైక్యతకు మసీదులో భోజనం.. హైదరాబాద్ నుంచి 20కిపైగా మసీదుల సమ్మతి

మసీదులు, దర్గాల్లో మిలాద్ ఉన్ నబీ పండుగ రోజున అన్ని మతస్తులకు భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వార భిన్న మతస్తులు ఎదుటి మతవిశ్వాసాలను అర్థం చేసుకుని గౌరవించడం, సామరస్యతను పెంచుకోవడం వీలవుతుందని చెబుతున్నారు. మసీదులో భోజన కార్యక్రమానికి హైదరాబాద్ నగరంలోనే 20కి పైగా మసీదులు అంగీకరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాల్లోని 300కు పైగా మసీదులు ఈ నిర్ణయానికి సమ్మతించాయి.
 

uniting people using religion by conducting meal at masjid on milad un nabi kms
Author
First Published Sep 29, 2023, 2:20 PM IST

న్యూఢిల్లీ: ఇండియాలో ఒక విశ్వాసం నుంచి ఆహారాన్ని వేరు చేయలేం. అంతగా మిళితమై ఉంటాయి. ముస్లింలు, యూదులు, సిక్కులు, క్రైస్తవులు, హిందువులు ఎవరైనా సరే.. వారి మతానికి సంబంధించిన పండుగ వచ్చిందంటే కిచెన్‌లో వంటలు గుమగుమాలాడుతాయి. ఈ గుమగుమలు వారిని ఉత్సాహపరుస్తాయి.

ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లినప్పుడు లక్షలాది మంది ఆకలిని ఇలాంటి వంటలే తీరుస్తాయి. దర్గా షరీఫ్‌లు అయితే మీఠే చావల్, యూధుల రోష్ హషనాలైతే హల్వా, గుుద్వారా అయితే గురు కా లంగర్, హిందు దేవాలయాల వద్ద లెమన్ రైస్ లేదా షీరాలు వండుతుంటారు. 

మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరుపుకునే మిలాద్ ఉన్ నబీ రోజున మసీదులు, దర్గాల కమిటీలు అన్ని మతాల ప్రజలకు భోజనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. మతపరమైన గోడలను కూల్చివేయాలనే ఉద్దేశ్యంతో మసీదులో భోజన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. వేర్వేరు మత విశ్వాసాలను అర్థం చేసుకోవడానికి ఇదొక వారధిగా దోహదపడుతుందని భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో విజిట్ మై మాస్క్ అనే కార్యక్రమం రెండో విడత నిర్వహిస్తున్నారు. పూర్వ కార్యక్రమాల్లో అనేక మసీదులు అన్ని మతాల ప్రజలకు తెరిచారు. ఇప్పుడు మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో భాగంగా వారు భోజనం పెట్టాలనే కొత్త ప్రతిపాదన తెచ్చారు. హైదరాబాద్‌తోపాటు విజయవాడ వంటి దేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లోని మసీదులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. భోజన కార్యక్రమానికి సిద్ధం అయ్యాయి.

సీవోబీవే అనే పీస్ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మజహర్ హుస్సేన్ ఈ కార్యక్రమానికి రూపం ఇచ్చారు. గతంలోనూ ఇలాంటి సమ్మేళనాలు జరిగాయని, ఇలాంటి పండుగలకు మతాలకు సంబంధం లేకుండా సన్నిహితులను పిలుచుకుని వేడుకలు చేసుకున్నారని చెబుతారు.

‘జిలేబీతో ప్రజలు వారి ఉపవాసాన్ని ముగించుకునేవారు. కెబాబ్, ఫుక్కా బేవరేజ్‌లు సేవించేవారు. గిదబ్‌దారన్ అనేక పాత్రలో గులాబీ నీటిని చల్లేవారు. తీపి వంటకాలను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా ఉండేది’ అని చెప్పారు. ఈ సాంప్రదాయం కొనసాగాలని అన్నారు.

మిలాద్ ఉన్ నబీ ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన వచ్చిది. కానీ, హైదరాబాద్ ముస్లిం నాయకులు మిలాద్ ఉన్ నబీ కార్యక్రమాలను సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో నిర్వహించారు. సెప్టెంబర్ 28వ తేదీన జరిగిన పతి నిమజ్జనంతో క్లాష్ కావద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారు సెప్టెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు మసీదులో భోజనం అనే కార్యక్రమాన్ని మసీదులు, దర్గాల్లో నిర్వహించారు.

ఈ కార్యక్రమం ఉద్దేశం మత నేతలను ఆహ్వానించడం కాదు.. ఇతర సముదాయాల నుంచి యువతను రప్పించడం, ఇరుగుపొరుగును రప్పించడం అని మజహర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందని వివరించారు. ఈ సారి కూడా మిలాద్ ఉన్ నబీకి లంచ్ లేదా డిన్నర్ ఏర్పాటు చేయడానికి ఏడు దేశాల్లోని 300కు పైగా మసీదులు అంగీకరించాయి. అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లోని మసీదులు ఈ కార్యక్రమం లో భాగం పంచుకున్నాయి.

Also Read: హిందూ విద్యార్థిని చెంపదెబ్బ కొట్టమని ముస్లిం విద్యార్థికి సూచించిన టీచర్.. అరెస్ట్..

హైదరాబాద్ నగరంలోనే 20కిపైగా మసీదులు ముందుకు వచ్చాయి. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ప్రారంభించారు. అందులో ఫొటోలను అప్‌లోడ్ చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా అతిథులు మహమ్మద్ ప్రవక్త జీవితం గురించి తెలుసుకునే అవకాశం దక్కుతుందని, అదే విధంగా దర్గా, మసీదులకు వచ్చే వారు ముస్లిమేతరుల బోధనలనూ అర్థం చేసుకోగలుగుతారని మజహర్ తెలిపారు. ఒకరంగా ఇది వేర్వేరు మతాల వారు ఎదుటి వారి మత విశ్వాసాలను తెలుసుకుని, అర్థం చేసుకోవడానికి సరిగ్గా ఉపయోగపడుతుందని, వారి మతాలకు సంబంధించిన వివరాలను ఇచ్చిపుచ్చుకోవడం వీలు చిక్కుతుందని చెప్పారు. ఆ తర్వాత లంచ్ లేదా డిన్నర్ ఉంటుందని వివరించారు. ఇతర మత పెద్దలూ తమ మత వేడుకల్లో ఇలాంటి భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి మత విశ్వాసాలను పరస్పరం చర్చించుకుని అర్థం చేసుకునే అవకాశాల గురించి తాము ఆలోచనల చేస్తున్నామని తెలిపారు. ఈ విధంగా ఎదుటి మతస్తులను మరింత సాదరంగా సన్నిహితులను చేసుకోవచ్చని, వేర్వేరు మతస్తుల మధ్య అవగాహన లోపం లేకుండా చూసుకోవచ్చని చెప్పారు.

మిలాద్ ఉన్ నబీ అనేది ప్రారంభం మాత్రమేనని, పండుగ సమయాల్లో దర్గాలు, మసీదుల్లో ఈ కార్యక్రమాలతోపాటు ఇతర సముదాయల బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఇతర సహకార శిబిరాలను నిర్వహణకూ అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే జంట నగరాల్లోని అనేక మసీదులు ప్రజలకు ఉపయోగకరమైన వృద్ధాశ్రమాలు, ఆరోగ్య శిబిరాలు, స్లమ్స్‌లోని పిల్లలకు మధ్యాహ్నం భోజనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని వివరించారు.

పండుగలకు పొరుగున ఉండే ఇతర మతస్తులతోనూ వేడుక చేసుకోవాలనే లక్ష్యంగా కోసమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మజహర్ చెప్పారు. ఇది కేవలం భిన్న మతస్తులు తమ విశ్వాసాల గాఢతను పంచుకోవడమే కాదు.. కలిసి భోజనం చేసి ఒకరి తోడును మరొకరు ఆస్వాదించడం కోసమూ ఇవి ఉపయోగపడుతాయని వివరించారు.

 

---- రత్నా జీ. చోత్రాని

Follow Us:
Download App:
  • android
  • ios