న్యూఢిల్లీ:విపక్ష సభ్యుల గందరగోళం మధ్యే రాజ్య సభలో వ్యవసాయబిల్లుకు ఆమోదం తెలిపింది. విపక్షపార్టీల సభ్యులు పోడియం వద్దే నిలబడి ఆందోళనకు దిగారు. 

వాయిస్ ఓటు ద్వారా రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు  రాజ్యసభలో ఆమోదం లభించింది. ఈ బిల్లులను వైసీపీ, బీజేడీలు  మినహా ఇతర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆకాలీదళ్, ఆప్, టీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్ద నిలబడి ఆందోళనకు దిగారు. 

also read:వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో గందరగోళం: బిల్లు పత్రుల చించివేత

అంతకుముందు విపక్ష సభ్యులు ఈ బిల్లు ప్రతును చింపి విసిరేశారు. డిప్యూటీ ఛైర్మెన్  మైక్ ను లాగేందుకు ప్రయత్నించారు.ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 

విపక్షాల నిరసనల మధ్యే వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర మంత్రివర్గం నుండి అకాలీదళ్ వైదొలిగింది.

మూడు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఇవాళ ఆమోదం తెలిపింది. రాజ్యసభ సభలో ఏ కూటమికి చెందని పార్టీల మద్దతును అధికార బీజేపీ కూడగట్టింది. రాజ్యసభలో బీజేపీకి 105 మంది సభ్యులున్నారు. 25 మంది ఎంపీలు ఎన్డీఏ, యూపీఏకి చెందిన కూటమిలో లేని పార్టీలకు చెందిన సుమారు 25 మంది మద్దతును బీజేపీ కూడగట్టింది.

ఈ బిల్లులపై ఓటింగ్ జరిగితే ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు చేసింది. అయితే వాయిస్ ఓటింగ్ ద్వారానే ఈ బిల్లును రాజ్యసభలో పాస్ చేయించుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది.