మూడు రోజుల ఈశాన్య పర్యటనలో ఉన్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఓ కొత్త అనుభాన్ని ఎదుర్కొన్నారు. సైనికులతో కలిసి సంభాషిస్తున్న సమయంలో అందులో ఒకరు ‘సందేసే ఆతే హై’ పాట పాడారు. దీంతో అక్కడ ఉన్న అధికారులు, రాజ్ నాథ్ సింగ్ ఆయనతో కలిసి పాట పాడారు. 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అస్సాంలోని ఆర్మీ స్టేషన్‌ను సందర్శించిన సందర్భంగా చోటు చేసుకున్న ఓ పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ ఆర్మీ జవాన్లు ఆయ‌న కోసం ఫేమస్ బాలీవుడ్ సాంగ్ అయిన ‘సందేసే ఆతే హై’ ను పాడారు. ఆ జ‌వాన్ల పాట‌కు రాజ్ నాథ్ సింగ్ కూడా జ‌త క‌లిపారు. ఈ దృశ్యాల‌కు సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ విడుద‌ల చేసింది. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అసోంలో పడవ మునక.. అధికారులు సహా పది మంది గల్లంతు

కొంతమంది ఉన్నతాధికారులతో పాటు రక్షణ మంత్రి కూడా ఇండియ‌న్ ఆర్మీ జ‌వాన్లు ఎంతో ల‌య‌బద్దంగా ‘సందేసే ఆతే హై’ అనే పాట పాడారు. ‘‘ అసోంలోని దింజన్‌లో భారత ఆర్మీ సిబ్బందితో అద్భుతమైన మూమెంట్ ఇది. ఈ సైనికుల ధైర్యం, అప్రమత్తత, శౌర్యం కారణంగా మన దేశం సురక్షితంగా ఉంది ’’ అని రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

ఇసుక అక్రమ రవాణా పై గొడవ.. రెండు ముఠాల మధ్య కాల్పులు.. నలుగురు దుర్మరణం.. ఎక్కడంటే?

మూడు రోజుల ఈశాన్య పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం అస్సాంలోని ఇండియ‌న్ ఆర్మీ జ‌వాన్ల‌ను క‌లిశారు. ఆయ‌న వెంట ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, ఈస్టర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్‌పి కలితాతో పాటు ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మౌంటైన్ డివిజన్ సైనికులతో సంభాషించారు. సాయంత్రం సైనికులతో క‌లిసి టీ తాగారు. ఇదే స‌మ‌యంలో ఓ సైనికుడు పాట పాడితే సంతోషంతో ర‌క్ష‌ణ శాఖ మంత్రి, ఇత‌ర అధికారులు కూడా గొంతు క‌లిపారు. ఇలా పాట పాడేట‌ప్పుడు రాజ్ నాథ్ సింగ్ ఆనందంగా క‌నిపించారు. 

Scroll to load tweet…

ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రక్షణ మంత్రి వివాదాస్పద వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి మౌలిక సదుపాయాల అభివృద్ధి స్థితిని, భారత సైన్యం పోరాట, కార్యాచరణ సంసిద్ధతను పర్యవేక్షించారు. జనరల్ ఆఫీసర్ కమాండింగ్, 3 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్‌సి తివారీ, ఇతర సీనియర్ అధికారులు ఆయనకు సమాచారం అందించారు.

Scroll to load tweet…

ఫ్రంట్‌లైన్‌లో మోహరించిన దళాల కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అత్యాధునిక సైనిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధి వంటి విష‌యాలు కూడా కేంద్ర మంత్రికి సైనికాధికారులు వివ‌రించారు. దీంతో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో స్పియర్ కార్ప్స్ అన్ని ర్యాంక్‌ల అధికారులు చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. కాగా.. నేడు రక్షణ మంత్రి అరుణాచల్ పర్యటించారు. భారత దళాలతో సంభాషించారు.