Asianet News TeluguAsianet News Telugu

ఆవును అసెంబ్లీకి తీసుకొచ్చిన రాజ‌స్థాన్ బీజేపీ ఎమ్మెల్యే.. ఎందుకంటే ?

రాజస్థాన్ లో విజృంభిస్తున్న‌ లంపీ వైరస్ పట్ల ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే వినూత్నంగా నిరసన తెలిపారు. ఓ ఆవును తీసుకొని నేరుగా అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. 

Rajasthan BJP MLA who brought a cow to the assembly.. because?
Author
First Published Sep 20, 2022, 3:18 PM IST

రాజస్థాన్‌లో వేల సంఖ్యలో ఆవులు లంపీ వైరస్ (చ‌ర్మ వ్యాధి) బారిన ప‌డ్డాయి. ఇది కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మెడకు చుట్టుముడుతోంది. ఈ వ్యాధి తీవ్ర‌త‌రం అవుతుండ‌టంతో రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే వైర‌స్ నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ అజ్మీర్‌లోని పుష్కర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ సింగ్ రావత్ వినూత్నంగా నిర‌స‌న తెలిపారు. 

కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు హైకోర్టు షాక్.. ఆయన ఇంటిలోని అక్రమ నిర్మాణాన్ని కూల్చేయండి.. రూ. 10 లక్షల ఫైన్

అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఓ ఆవును కూడా త‌న వెంట తీసుకొని వ‌చ్చాడు. ఆ ఆవుకు తాడు కట్టి అసెంబ్లీ గేటు వ‌ద్ద‌కు చేరుకోగానే జ‌ర్న‌లిస్టులు అత‌డిని చుట్టుముట్టారు. దీంతో ఆయ‌న అక్క‌డే మీడియాతో మాట్లాడ‌టం ప్రారంభించాడు. లంపీ వైర‌స్ కార‌ణంగా అనేక ఆవులు చ‌నిపోతున్నాయ‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. దీని వ‌ల్ల పాలు అమ్ముకొని జీవించే రైతుకు చాలా న‌ష్టం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఆవులు చ‌నిపోతే రైతులు ఎలా జీవిస్తార‌ని ప్ర‌శ్నించారు. ఈ వైర‌స్ వ‌ల్ల ఆవుల‌ను కోల్పోయిన రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం అందించాల‌ని డిమాండ్ చేశారు. 

అయితే ఎమ్మెల్యే సురేష్ సింగ్ రావత్ మీడియాతో మాట్లాడుతున్న స‌మ‌యంలో అక్క‌డ కొంచెం అల్ల‌రి చెల‌రేగ‌డంతో ఆవు బెదిరిపోయింది. దీంతో అది పారిపోయింది. దీనిని కూడా ఆ ఎమ్మెల్యే త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నాడు. అశోక్ గెహ్లాడ్ ప్ర‌భుత్వంపై ఆవు కూడా కోపంగా ఉంద‌ని అన్నారు. 

నటి దీప ఆత్మహత్య.. తమిళ ఇండస్ట్రీలో విషాదం.. సూసైడ్ నోట్ లో ఏముందంటే...

కాగా.. ఆవు పారిపోయ‌వ‌డానికి కార‌ణ‌మ‌య్యారంటూ జ‌ర్నలిస్టుల‌పై ఎమ్మెల్యే కొంత అసంతృప్తి వ్య‌క్తం చేశారు. “గోమాత వచ్చినప్పుడు మీరు కెమెరాలతో దాని ముందు నిలిబ‌డ్డారు. మీరు ఆవుకు కొంత దూరంగా ఉండాల్సింది. ఈ గంద‌ర‌గోళ ప‌రిస్థితుల వ‌ద్ద ఆవు పారిపోయింది. ఆవుల కోసం నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి రూ.10 లక్షలు ఇచ్చాను. కానీ అందులో స‌గం కూడా నిరుపేద రైతులకు చేరువ కాలేదు. ’’ అని సురేష్ సింగ్ రావత్ చెప్పారు.

డీఎంకేకు డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సుబ్బులక్ష్మి జగదీశన్ రాజీనామా.. స్టాలిన్ గురించి ఏమన్నారంటే?

ఇదిలా ఉండ‌గా.. లంపీ వైర‌స్ ను అరిక‌ట్ట‌డానికి త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఈ వ్యాధి నుంచి ఆవుల ప్రాణాలను ర‌క్షించ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ మొదటి ప్రాధాన్యత అని అన్నారు. ఈ వైర‌స్ నియంత్ర‌ణ‌కు కేంద్ర ప్రభుత్వం టీకాలు, మందులు ఇవ్వాల‌ని కోరారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios