Asianet News TeluguAsianet News Telugu

నటి దీప ఆత్మహత్య.. తమిళ ఇండస్ట్రీలో విషాదం.. సూసైడ్ నోట్ లో ఏముందంటే...

ప్రేమించిన వ్యక్తి దక్కలేదనే ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన మరణానికి ఎవ్వరూ బాధ్యులు కాదని దీప సూసైడ్ నోట్ లో రాసుకొచ్చింది. 

Tamil Actor Deepa aka Pauline Jessica Found Dead, Suicide Note Found
Author
First Published Sep 20, 2022, 2:07 PM IST

చెన్నై : ప్రముఖ తమిళ నటి పౌలిన్ జెస్సికా సెప్టెంబరు 18న చెన్నైలోని విరుగంబాక్కం మల్లికా అవెన్యూలోని తన అద్దె ఫ్లాట్‌లో శవమై కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఆమె అసలు పేరు పౌలిన్ జెస్సికా. ఇటీవల విడుదలైన తమిళ చిత్రం 'వైధా'లో ప్రధాన పాత్ర పోషించింది. అంతేకాకుండా, ఆమె పలు తమిళ సినిమాలు, సీరియల్స్‌లో పనిచేసింది. రీల్స్, టిక్ టాక్ వీడియోలతో తనకంటూ గుర్తింపును సంపాదించుకుందిన నటిగా ఎదిగిన దీప సెప్టెంబర్ 18 ఆదివారం తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని కనిపించింది.

ఈ మేరకు కోయంబేడు పోలీసులకు ఆమె పొరుగింటివారి నుండి సమాచారం అందింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కిల్పాక్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అనంతరం దీప బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. ప్రముఖ నటి పౌలిన్ జెస్సికా ఆత్మహత్యపై అన్ని వైపుల నుంచి విచారణ జరుపుతున్నామని, సీసీటీవీ సాయం తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

త‌మిళ‌నాడులో దారుణం.. డీఎంకే కార్య‌క‌ర్త‌ను న‌రికి చంపిన మ‌హిళ‌.. ఎందుకంటే ?

ఆమె చనిపోవడానికి ముందు పౌలిన్ నివాసానికి ఎవరెవరు వచ్చారని పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం.. ఆత్మహత్యకు ముందు, ఆమె ఆటోలో ఆమె అపార్ట్మెంట్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆమె ఫ్లాట్ ముందు గుర్తు తెలియని వ్యక్తి తచ్చాడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా ఆమెను ఆత్మహత్యకు పురికొల్పారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూసైడ్ స్పాట్ లో  దొరికిన లెటర్ లో తన మరణానికి విఫల సంబంధమే ప్రధాన కారణమని ఆమె రాసినట్టుగా ఉంది. చెన్నైలోని విరుగంబాక్కంలోని మల్లికై అవెన్యూలోని తన నివాసంలో ఆమె ఉరివేసుకుని చనిపోయింది. గత కొద్దిరోజులుగా ఆమె మానసిక ఒత్తిడికి గురైందని స్నేహితులు చెబుతున్నారు. మరోవైపు ప్రేమవ్యవహారమే కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

స‌ర‌దా కోసం కాబోయే భార్య న‌గ్న చిత్రాలను షేర్ చేసిన డాక్ట‌ర్.. కొట్టి చంపిన ఆమె స్నేహితులు

అయితే, ఆమె ఆత్మహత్య విషయం తెలియని కుటుంబసభ్యులు.. ఆమెకు ఫోన్ చేయడానికి ప్రయత్నించగా.. ఆమె ఫోన్ ఎత్తడం లేదు. దీంతో ఆమె స్నేహితుడు ప్రభాకరన్ కు విషయం తెలుపగా అతను ఇంటికి వెళ్లి చూస్తే.. దీప ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది.  సూసైడ్ నోట్ లో తన ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదని రాసుకొచ్చింది దీప. తాను జీవితాంతం ఒకరిని ప్రేమిస్తానంటూ తెలిపింది. అయితే, అతని పేరు మాత్రం ప్రస్తావించలేదు. 

దీప మొదటిసారిగా తమిళనాడులో రిపోర్టర్ గా, యాంకర్ గా పనిచేశారు. ఆ తరువాత సినీ ఇండస్ట్రీలో హీరోయిన అవ్వాలనే కోరికతో టిక్ టాక్ లో చిన్న చిన్న వీడియోలు చేశారు. దీంతో ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. అలా వచ్చిన ఫాలోయింగ్ ఆమెను సీరియల్ నటిగా, సహాయనటిగా మార్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios