భోపాల్: ఒడిశాలో చోటు చేసుకున్న దారుణమైన సంఘటనలో అధికారులు కదిలారు. ఓ మహిళపై సామూహిక అత్యాచారం పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దజీంతో ఇద్దరు రైల్వే ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. 

జూనియర్ ఇంజనీర్ రాజేశ్ తివారీ, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అలోక్ మాలవీయాలు డబ్ల్యూసీఆర్ భోపాల్ డివిజన్ లో ఉద్యోగులు. రాజేశ్ కు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళతో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అతడు ఆమెను భోపాల్ కు రావాలని చెప్పాడు. 

దాంతో ఆమె శనివారం ఉదయం భోపాల్ కు వచ్చింది. రాజేశ్ ఆమెను భోపాల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గదిలో ఉంచాడు. ఆ తర్వాత మాలవీయతో కలిసి ఆమెకు డ్రింక్ తాగించాడు. ఆ తర్వాత వారిద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

దానిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఘటనపై భోపాల్ డివిజనల్ రైల్వే మేనేజర్ శాఖాపరమైన విచారణ చేపట్టారు. నిందితులను సస్పెండ్ చేశారు.