Asianet News TeluguAsianet News Telugu

రాహుల్, సోనియాలు ‘న‌కిలీ గాంధీలు’.. కాంగ్రెస్ మొత్తం బెయిల్ పై ఉంది - క‌ర్ణాట‌క సీఎం బసవరాజ్ బొమ్మై

రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు నకిలీ గాంధీలు అని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు బెయిల్ పై ఉన్నారని చెప్పారు. 

rahul , Sonia are fake Gandhi.. Entire Congress is on bail - Karnataka CM Basavaraj Bommi
Author
First Published Oct 2, 2022, 2:53 PM IST

కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ‘నకిలీ గాంధీలు’ అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అభివర్ణించారు. ‘‘ ఈరోజు గాంధీ జయంతి రోజున నకిలీ గాంధీల గురించి నేను ఎందుకు మాట్లాడాలి ? కాంగ్రెస్ పార్టీ మొత్తం బెయిల్‌పై ఉంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, డీకే శివకుమార్ బెయిల్‌పై బయట ఉన్నారు ’’ అని ఆయన చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, ఇతర రాష్ట్రాల్లో నిధుల కోసం దాన్ని రాష్ట్రాన్ని ఉప‌యోగించుకోవాల‌ని చూస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ‘కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం, ఇప్పుడు అది పోయింది’ అని బొమ్మై పేర్కొన్నారు.

గుజ‌రాత్ లో గ‌ర్బా కార్య‌క్ర‌మంలో కేజ్రీవాల్ పైకి ప్లాస్టిక్ బాటిల్.. !

కాగా.. బొమ్మై ‘బెయిల్’ వ్యాఖ్యపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) చీఫ్ డీకే శివకుమార్ స్పందిస్తూ.. బీజేపీలోని డ‌జ‌న్ల కొద్దీ నాయ‌కుల‌కు బెయిల్ పై ఉన్నార‌ని అన్నారు. ‘‘ అవును, నేను బెయిల్‌పై ఉన్నాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా బెయిల్‌పై ఉన్నారు. వారు (బీజేపీ) బెయిల్‌పై ఉన్నారు. యడియూరప్పపై ఎలాంటి కేసు లేదా? బొమ్మై నాపై కేసులు పెట్టాడు. నన్ను పరప్పన అగ్రహార (సెంట్రల్ జైలు)కు పంపించండి. నేను కొంత విశ్రాంతి తీసుకుంటాను ’’ అని ఆయన అన్నారు.

డబ్బుల కోసం తాగుబోతు తండ్రి దారుణమైన ప్లాన్.. 32 ఏళ్ల వ్యక్తికి 13 ఏళ్ల బిడ్డను ఇచ్చి..!

రాష్ట్రంలో ‘పేసీఎం’ వివాదం చెలరేగినప్పటి నుంచి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బొమ్మై ముఖంతో ‘పేసీఎం’ అని రాసి ఉన్న పోస్టర్లు బుధవారం బెంగళూరులోని పలు ప్రాంతాల్లో కనిపించడంతో ఇదంతా ప్రారంభమైంది. డిజిటల్ వాలెట్ పేటీఎం తరహాలో రూపొందించిన ఈ పోస్టర్లలో క్యూఆర్ కోడ్ మధ్యలో బొమ్మై ముఖాన్ని ‘ఇక్కడ 40 శాతం ఆమోదించారు’ అనే సందేశం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

సోష‌ల్ మీడియాలో తప్పుడు వార్త‌ల‌ను, ద్వేశాన్ని ప్ర‌చారం చేయొద్దు - యూజ‌ర్ల‌కు కేంద్రం హెచ్చ‌రిక

తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమైనవని బొమ్మై ఖండించారు. ‘ఏ ఆరోపణలూ నిజం కాదు. వారు (కాంగ్రెస్) ఎలాంటి ఆధారాలూ ఇవ్వ‌లేదు. ఇదంతా రాజకీయ ప్రేరేపితమే. రుజువులను సమర్పించమని నేను వారిని సవాలు చేశాను. వారి (కాంగ్రెస్) పాలనలో, విచారించాల్సిన అనేక కుంభకోణాలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ ('పేసీఎం') అనేది దుష్ట డిజైన్’ అని బొమ్మై అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios