Asianet News TeluguAsianet News Telugu

సోష‌ల్ మీడియాలో తప్పుడు వార్త‌ల‌ను, ద్వేశాన్ని ప్ర‌చారం చేయొద్దు - యూజ‌ర్ల‌కు కేంద్రం హెచ్చ‌రిక

సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, ద్వేశాన్ని ప్రచారం చేయకూడదని వినియోగదారులను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇలా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపింది. 

Dont spread fake news and hate on social media - Center warns users
Author
First Published Oct 2, 2022, 1:37 PM IST

సోషల్ మీడియాలో వినియోగదారులు ద్వేషాన్ని ప్రచారం చేయొద్ద‌ని, త‌ప్పుడు వార్త‌ల‌ను వ్యాప్తి చేయొద్ద‌ని కేంద్రం హెచ్చ‌రించింది. అలాంటి ఖాతాల‌ను గుర్తించి బ్లాక్ చేస్తామ‌ని పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్ట‌ర్ నిబంధ‌న‌లు ఉల్ల‌ఘించిన కార‌ణంగా భారతదేశంలో నిలిచిపోయిన కొన్ని గంట‌ల త‌ర్వాత ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. 

ఈ నెల 6న జాతీయపార్టీ రిజిస్ట్రేషన్‌కై ఢిల్లీకి టీఆర్ఎస్ నేతలు: మహరాష్ట్ర నుండి కేసీఆర్ దేశ వ్యాప్త టూర్

ఈ విష‌యంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ట్విటర్ లేదా మరేదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో నకిలీ వార్తలను వ్యాప్తి చేసినా, అలాగే ద్వేషాన్ని ప్రచారం చేసే, చట్టాన్ని ఉల్లంఘించే ఏ అకౌంట అయిన భార‌త్ లో ప‌ని చేసేందుకు అనుమ‌తి లేదని అన్నారు.

భారతదేశ 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గురించిన ప్రత్యేక విషయాలు

‘‘ దేశంలో ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిన 80 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అది 120 కోట్లకు పెరగాలని మేము కోరుకుంటున్నాము. ప్రజలు ఇంటర్నెట్‌ను విశ్వసించాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఏదైనా అకౌంట్ అబద్ధాలు చెబుతూ, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను ఉంచినట్లయితే వాటిని ఖచ్చితంగా నిలపివేస్తాం. ఇంటర్నెట్‌ని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలి. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కాదని మేము విశ్వసిస్తున్నాం ’’ అని ఆయన అన్నారు.

పండుగల వేళ ప్రమాదాలు.. రెండు యాక్సిడెంట్‌లలో 31 మంది దుర్మరణం.. 30 మందికి గాయాలు

శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన ట్విట్టర్ ఖాతా భారతదేశంలో నిలివేశారు. ఇటీవ‌లి కాలంలో ఇలాంటి ఘ‌ట‌న రెండోది. ఇంతకు ముందు జూలైలో కూడా దీనిని నిలిపివేశారు. కానీ మ‌ళ్లీ యాక్టివ్ చేశారు. కానీ శ‌నివారం ఆ అకౌంట్ లో విత్‌హెల్డ్ అనే మెసేజ్ క‌నిపించింది. 

కాగా.. ఇటీవ‌ల భారతదేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 16 యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లతో పాటు ఆరు పాకిస్తాన్ ఆధారిత ఛానెల్‌లను బ్లాక్ చేసింది.

5జీ వ‌ల్ల విద్యా రంగానికి ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుతుంది - కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

భారత్‌కు వ్యతిరేకంగా విద్వేషపూరిత కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నందుకు గాను ఇప్పటివరకు 100కు పైగా యూట్యూబ్ ఛానెల్‌లు, 4 ఫేస్‌బుక్ పేజీలు, 5 ట్విట్టర్ ఖాతాలు, 3 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios