Asianet News TeluguAsianet News Telugu

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం.. వైమానిక దళంలో చేర‌నున్న లైట్ కంబాట్ హెలికాప్టర్లు

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏరోస్పేస్ మేజర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)చే అభివృద్ధి చేయబడిన లైట్ కంబాట్ హెలికాప్టర్ల (ఎల్‌సిహెచ్)ల‌ను లాంఛ‌నంగా భార‌త వైమానిక దళం (ఐఎఎఫ్)లో లాంఛనంగా చేరనున్నాయి. 

IAF To Formally Induct Indigenously Built Light Combat Helicopter Today
Author
First Published Oct 3, 2022, 5:26 AM IST

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. వీటితో భారత ఆర్మీ క్షిపణి వ్యవస్థ  మరింత బలోపేతం కానున్న‌ది. బ్రహ్మోస్, అగ్ని, పినాకా శతఘ్నుల సరసన  నేడు లైట్ కంబాట్ హెలికాప్టర్ కూడా చేరింది.
పూర్తిగా స్వదేశీ సాంకేతిక‌తో అభివృద్ధి చేసిన తేలికపాటి హెలికాప్టర్ (ఎల్‌సిహెచ్) సోమవారం భారతీయ వైమానిక దళం (ఐఎఎఫ్)లో లాంఛనంగా చేరనున్నాయి.

వాయుసేనలో చేరే దేశీయ హెలికాప్టర్ల క్రమంలో ఇది తొలి విడ‌త హెలికాప్టర్. యుద్ధ పరాక్రమానికి ఇవి ప్రోత్సాహకంగా ఉంటాయ‌ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  తాను దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి లైట్ కోమాట్ హెలికాప్టర్ల (LCH) ఇండక్షన్ వేడుకకు హాజరయ్యేందుకు సోమ‌వారం( అక్టోబర్ 3న) రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చేరుకోకున్నాను. ఈ హెలికాప్టర్ల ఇండక్షన్ IAF యొక్క పోరాట పటిమకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దాని కోసం ఎదురుచూస్తున్నాను' అని సింగ్ ట్వీట్ చేశారు.  రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగే ఓ కార్యక్రమంలో వాయుసేన దళంలోకి ఈ హెలికాప్టర్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,  పాటు ఎయిర్‌స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది .  

3,887 కోట్ల కొనుగోలుకు ఆమోదం
ఈ ఏడాది మార్చిలో, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతపై కేబినెట్ కమిటీ (CCS) రూ. 3,887 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 15 LCHలను కొనుగోలు చేయడానికి ఆమోదించింది. వీటిలో 10 హెలికాప్టర్లు వైమానిక దళానికి మరియు ఐదు ఆర్మీకి చెందినవని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎల్‌సిహెచ్ 'అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్' ధృవ్‌ను పోలి ఉందని అధికారులు తెలిపారు.

ఇందులో అనేక 'స్టెల్త్' (రాడార్ ఎగవేత) ఫీచర్లు, పకడ్బందీ రక్షణ వ్యవస్థ, నైట్ ఎటాక్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ సామర్థ్యం ఉన్నాయని తెలిపారు. తేలికైనందున, ఇది క్షిపణులు మరియు ఇతర ఆయుధాలను దాని పూర్తి సామర్థ్యంతో ఎత్తైన ప్రదేశాలలో సౌకర్యవంతంగా పనిచేయగలదు.


ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏరోస్పేస్ మేజర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)చే అభివృద్ధి చేయబడిన పోరాట హెలికాప్టర్ ప్రధానంగా అత్యంత ఎతైన దుర్భేధ్య ప్రాంతాలలోకి చొచ్చుకుని వెళ్లేలా వీటిని రూపోందించారు. ఈ హెలికాప్ట‌ర్లు బహుళ స్థాయి వేదికగా ఉంటూ ఏకకాలంలో పలు మిస్సైళ్లను ప్రయోగించగలవు. ఇతర ఆయుధాలను కూడా  సమ‌ర్థ‌వంతంగా లక్షాలను ఛేదిస్తుంది. 

భారత వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి సమక్షంలో ప్రవేశపెడుతారని వాయుసేన అధికారులు తెలిపారు. ఈ రెండు ఇంజిన్ల వాయుసారధి ఇప్పటికే పలు రకాల ఆయుధాల పరీక్షలలో తన సత్తా చాటుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios