బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్.. ఆరిజన్ నిర్వాహకురాలు శేజల్ తో బీఆర్ఎస్ ఎంపీల చర్చలు..
బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై గత కొంత కాలంగా సంచలన ఆరోపణలు చేస్తున్న యువతి శేజల్ ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. వీరి మధ్య సుధీర్ఘంగా చర్చలు సాగాయి.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై గత కొంత కాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఆరిజన్ నిర్వాహకురాలు శేజల్ తో బీఆర్ఎస్ ఎంపీలు సమావేశం అయ్యారు. ఆమెతో గంటల పాటు చర్చలు జరిపారు. చిన్నయ్య లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని, అక్రమ కేసులు పెట్టించారని ఆమె రెండు నెలల నుంచి వివిధ రకాలుగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ నేతలు ఆమెతో సమావేశం అయ్యారు.
ఘోరం.. 11 నెలల చిన్నారిపై బాలుడు అత్యాచారం.. రక్తపు మడుగులో వదిలేసి పారిపోయిన మైనర్..
ఇందులో పెద్దపల్లి ఎంపీ నేత వెంకటేశ్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎంపీ రంజిత్‌రెడ్డి లు ఉన్నారు. వీరంతా శేజల్, ఆదివనారాయణలతో గంటల తరబడి మాట్లాడారు. ఈ సుధీర్ఘ సంభాషణలో గవర్నమెంట్ ల్యాండ్ కొనుగోలు చేసిన డబ్బుల వాపస్ తో పాటు.. తమపై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు కోరినట్టు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేపై యాక్షన్ తీసుకోవాలని వారు సూచించారు. దీనికి బీఆర్ఎస్ నేతలు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. తప్పు చేసిన వారిపై తప్పుకుండా చర్యలు ఉంటాయని చెప్పినట్టు సమాచారం. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది.