Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ అంటే రాముడు.. కాంగ్రెస్ అంటే భారత్ - కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రాహుల్ గాంధీని రాముడితో పోల్చారు. అలాగే కాంగ్రెస్ ను భారత్ తో పోల్చారు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

Rahul Gandhi means Rama.. Congress means India - Former Union Minister Salman Khurshid
Author
First Published Dec 27, 2022, 4:27 PM IST

కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రను ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. రామాయణ ఇతిహాసంతో పోల్చారు. రాహుల్ గాంధీ అంటే రాముడు అని, కాంగ్రెస్ అంటే భారత్ అని అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘రాహుల్ గాంధీ మానవాతీతుడు. మనమంతా గడ్డకట్టే చలిలో జాకెట్లు ధరిస్తున్నాం. కానీ ఆయన మాత్రం కేవలం టీ-షర్టుల ధరించి (భారత్ జోడో యాత్ర కోసం) బయటకు వెళ్తున్నాడు. ఆయన ఏకాగ్రతతో తపస్సు చేసే యోగి వంటివాడు ’’ అని అన్నారు. 

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి న్యాయవ్యవస్థకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోంది: మంత్రి కిరణ్ రిజిజు

‘‘శ్రీరామచంద్రుని ‘ఖడౌ’ చాలా దూరం వెళుతుంది. కొన్నిసార్లు రామ్ జీ చేరుకోలేనప్పుడు.. భరతుడు ‘ఖడౌ’ తీసుకొని ప్రదేశాలకు వెళ్తాడు. అదే విధంగా మేము కూడా ఉత్తర ప్రదేశ్ లో ‘ఖడౌ’ను తీసుకువెళ్ళాం. ఇప్పుడు ఆ ‘ఖడౌ’ ఉత్తర ప్రదేశ్ కు చేరుకుంది. రామ్ జీ (రాహుల్ గాంధీ) కూడా వస్తారు’’ అని ఆయన అన్నారు.

‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా కోవిడ్ ప్రోటోకాల్ కు కట్టుబడి ఉండాలని కోరుతూ రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసిన విషయంపై ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనికి ఖుర్షీద్ సమాధానం ఇస్తూ.. కోవిడ్ పై కాంగ్రెస్ కు ప్రత్యేక మార్గదర్శకాలు ఉండబోవని అన్నారు. సార్వత్రిక మార్గదర్శకాలు జారీ చేసినప్పుడల్లా పార్టీ నిబంధనలను అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

రాజకీయ దుమారాన్ని రేపుతున్న బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ వ్యాఖ్యలు.. కేసు నమోదు చేసిన పోలీసులు..

ఈ దేశానికి ఏదైనా శాస్త్రీయ ప్రోటోకాల్ వర్తిస్తే అది తమకు కూడా వర్తిస్తుందని చెప్పారు. కానీ కోవిడ్ -19 కాంగ్రెస్ కోసం వస్తుందని, బీజేపీ కోసం రాదని ఎవరూ చెప్పలేదని అన్నారు. ఎవరైనా ప్రోటోకాల్ ను పాటిస్తే, తాము కూడా దానిని పాటిస్తామని అన్నారు. కానీ నేడు ఆ ప్రోటోకాల్ లేదని ఆయన అన్నారు. 

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గత శనివారం దేశ రాజధానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎర్రకోట ఎదుట కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ కవాతు భారతదేశానికి ప్రతిరూపమని, ఇక్కడ ద్వేషం, హింస లేదని, ప్రజలందరినీ, జంతువులను కూడా స్వాగతిస్తున్నామని చెప్పారు. 

కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం.. బీజేపీలో మరో రచ్చ !

‘‘భారత్ జోడో యాత్రలో కుక్కలు కూడా వచ్చాయి. కానీ వాటికి ఎవరూ హాని చేయలేదు. ఆవు, గేదెలు, పందులు, అన్ని జంతువులు వచ్చాయి. ప్రజలందరూ వచ్చారు. ఈ యాత్ర మన భారతదేశం లాగా ఉంది. 2,800 కిలోమీటర్లు నడిచినప్పుడు ప్రజలలో ఎలాంటి ద్వేషం, హింసను నేను చూడలేదు. దేశంలో కూడా అవి కనిపించలేదు. కానీ నేను టీవీ ఆన్ చేసినప్పుడు ఎప్పుడూ ద్వేషమే కనిపిస్తుంది.’’ అని అన్నారు. వాస్తవ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే హిందూ-ముస్లిం అంటూ ప్రచారం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios