Asianet News TeluguAsianet News Telugu

రాజకీయ దుమారాన్ని రేపుతున్న బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ వ్యాఖ్యలు.. కేసు నమోదు చేసిన పోలీసులు..

హిందువులు ఆయుధాలను ఇళ్లల్లో ఉంచుకోవాలంటూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌పై శివమొగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై న్యాయ విచారణ జరగాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ట్వీట్ చేశారు. 

BJP MP Pragya Thakur's comments causing political scandal.. Police have registered a case..
Author
First Published Dec 27, 2022, 3:18 PM IST

బీజేపీ ఫైర్ బ్రాండ్, భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్నిరేపుతున్నాయి. హిందువులు తమ ఇళ్లలో ఆయుధాలను ఉంచుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందిస్తూ.. “ విద్వేషపూరిత ప్రసంగం చేసిన ఆమెపై న్యాయ విచారణ జరగాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు. 

ఆమె వ్యాఖ్యలపై కర్నాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ సింగ్ మండిపడ్డారు. ఠాకూర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ మత హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. “ఈ వ్యక్తులు హింసను ఎందుకు ప్రేరేపిస్తున్నారో నాకు నిజంగా తెలియదు. వారు ఏ ఎన్నికల్లోనైనా ఓడిపోతామనే భయపడే ప్రతీ సారి ప్రజలను రెచ్చగొట్టుతూ, మత హింసను ప్రోత్సహించడం ద్వారా మాత్రమే గెలవగలమని వారు భావిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి ’’ అని సింగ్ అన్నారు. 

కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం.. బీజేపీలో మరో రచ్చ !

‘‘ప్రగ్యా ఠాకూర్ ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి. పార్లమెంటు సభ్యురాలు కాబట్టి ఆమె అలాంటి ప్రకటనలు చేయడానికి అనుమతించకూడదు.’’ అపి ఆయన అన్నారు.  ఇదిలా ఉండగా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రగ్యా ఠాకూర్ పై శివమొగ్గ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద ఠాకూర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన శివమొగ్గ పోలీసులను అభ్యర్థించారు. 

సరిహద్దు వివాదం.. మహారాష్ట్ర అసెంబ్లీ వెలుపల సరికొత్తగా నిరసన తెలిపిన ప్రతిపక్షం.. ఏం చేశారంటే ?

ఇంతకీ ఆమె ఏమన్నారంటే ? 

కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో ఆదివారం హిందూ జాగరణ వేదిక సౌత్ రీజియన్ వార్షిక సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ హాజరై మాట్లాడారు. హిందూ సమాజం తమను తాము రక్షించుకోవడానికి ఇళ్లలో పదునైన ఆయుధాలను ఉంచుకోవాలని అన్నారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే హక్కు హిందువులకు ఉందని అన్నారు. ఆయుధాలు లేకపోతే కనీసం కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తులనైనా అందుబాటులో ఉంచుకోవాలని ఆమె సూచించారు. 

‘‘మీ ఇళ్లలో ఆయుధాలు ఉంచుకోండి. కుదరకపోతే  కనీసం కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తులు లేకపోతే ఇంకా ఏదైనా పదునైన ఆయుధాలు పెట్టుకోండి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో తెలియదు. ప్రతీ ఒక్కరికి తమను తాము కాపాడుకునే హక్కు ఉంది. ఎవరైనా మన ఇంట్లోకి చొరబడి దాడి చేస్తే దానికి తగిన విధంగా సమాధానం ఇవ్వడం మన హక్కు ’’ అని తెలిపారు. ‘లవ్ జిహాద్’ సంప్రదాయాన్ని అనుసరిస్తున్న వారిపైనా ఠాకూర్ విరుచుకుపడ్డారు. ‘‘వారికి జిహాద్ అనే సంప్రదాయం ఉంది. వారు ప్రేమించినా, వారు దానిలో జిహాద్ చేస్తారు. మేము (హిందువులు) కూడా దేవుడిని ప్రేమిస్తాము. సన్యాసి తన దేవుడిని ప్రేమిస్తాడు.’’ అని తెలిపారు.

ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పతక విజేతలకు డిప్యూటీ ఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాలు: మ‌ధ్య‌ప్రదేశ్

‘‘దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో అణచివేతదారులను, పాపపు ప్రజలందరినీ తొలగించకపోతే నిజమైన ప్రేమ మనుగడ సాగించలేదు. లవ్ జిహాద్ లో పాల్గొన్న వారితో కూడా అదే విధంగా ప్రతిస్పందించండి. మీ కుమార్తెలను రక్షించండి. వారిలో మంచి విలువలను నింపండి.’’ అని ఆమె అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios