రాహుల్ గాంధీ ప్రస్తుత రాజకీయాల్లో మీర్ జాఫర్.. ఆయన పార్లమెంటులో క్షమాపణ చెప్పాలి : బీజేపీ
ప్రస్తుత రాజకీయాల్లో రాహుల్ గాంధీ మీర్ జాఫర్ లాంటి వ్యక్తి అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈస్టిండియా కంపెనీ నుంచి సాయం పొందడానికి మీర్ జాఫర్ 24 పరగణాలు ఇచ్చారని తెలిపారు.

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయనను ప్రస్తుత రాజకీయాల్లో మీర్ జాఫర్ గా పోల్చింది. యూకేలో ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పక తప్పదని తేల్చి చెప్పింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ఎఫ్పుడూ దేశాన్ని కించపరుస్తూనే ఉంటాడని అన్నారు. ఆయన దేశాన్ని అవమానించారని, దేశంలో జోక్యం చేసుకోవాలని విదేశీ శక్తులను కోరారని తెలిపారు.
అదానీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు చేయాల్సిందే.. మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్ సభ వాయిదా
ఈ సందర్భంగా రాహుల్ గాంధీని మీర్ జాఫర్ తో సంబిత్ పాత్ర పోల్చారు. మీర్ జాఫర్ కూడా అదే పని చేశాడని, ఈస్ట్ ఇండియా కంపెనీ సాయం పొందడానికి 24 పరగణాలు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే తరహా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. భారత్ లో 'సహ్జాదా'గా మారేందుకు విదేశాల సాయం కోరుతున్నాడని పాత్రా ఆరోపించారు.
పార్లమెంటులో చర్చ ప్రజాస్వామ్యానికి ఆత్మ అని, అయితే రాహుల్ గాంధీ 2019 నుంచి కేవలం ఆరు సార్లు మాత్రమే అందులో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన చర్చలో పాల్గొనడం లేదని అన్నారు. ‘దురదృష్టవశాత్తూ నేనూ ఎంపీని’ అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సంబిత్ పాత్ర స్పందిస్తూ.. ‘రాహుల్ గాంధీకి ఏం చెప్పాలో తెలియడం లేదు. జైరాం రమేష్ సహకారంతోనే ఆయన మాట్లాడుతున్నారు.’ అని అన్నారు. ప్రత్యర్థి పక్షాల నిరసనల కారణంగా వరుసగా ఏడో రోజు పార్లమెంటు స్తంభించిపోయిన నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ తాజా దాడి చేసింది.
చెన్నై నుండి న్యూఢిల్లీకి చేరుకున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
కాగా.. ఇటీవల లండన్ లోని చాథమ్ హౌస్ లో జరిగిన ముఖాముఖిలో రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రతిపక్ష నేతల మైకులను తరచూ ఆఫ్ అవుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పలు ఆరోపణలు చేశారు. భారత్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి యూరప్, అమెరికా తగినంతగా కృషి చేయడం లేదని, ఆ దేశం నుంచి వాణిజ్యం, డబ్బు లభిస్తున్నాయని ఆయన అన్నారు.
మహిళలతో కాథలిక్ ప్రీస్ట్ రాసలీలలు.. లైంగిక వేధింపుల వీడియోలు వైరల్.. అరెస్ట్..
దేశంలోని వివిధ సంస్థలకు ముప్పు పొంచి ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘మా దేశంలోని వివిధ సంస్థలను స్వాధీనం చేసుకోవడంలో వారు ఎంత విజయవంతమయ్యారో నాకు షాక్ ఇచ్చింది. పత్రికలు, న్యాయవ్యవస్థ, పార్లమెంటు, ఎన్నికల కమిషన్ అన్నీ ఏదో ఒక విధంగా నియంత్రణలో ఉన్నాయి’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఆరెస్సెస్ ను ఛాందసవాద, ఫాసిస్టు సంస్థగా అభివర్ణించిన ఆయన, భారత్ లోని అన్ని సంస్థలను హస్తగతం చేసుకుందని ఆరోపించారు.