బెంగళూరు: డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకునేందుకు సినీ నటి రాగిణి ద్వివేది చాలా ఎత్తులే వేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎత్తులు పారలేదని సమాచారం. చివరకు అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. బెంగళూరులోని యలహంకలో తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న అపార్టుమెంట్ ను ఆమె అమ్మకానికి పెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 

కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో ఆదాయం పన్ను శాఖ తన అస్తులను జప్తు చేస్తుందనే భయంతో ఆ అపార్టుమెంటును అమ్మకానికి పెట్టినట్లు చెబుతున్నారు. అయితే, దాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. దాన్ని కొంటే రానున్న రోజుల్లో సమస్యలు ఎదురు కావచ్చునని భయపడి ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు. 

Also Read: డ్రగ్స్ కేసు.. సినీ నటి రాగిణి ద్వివేదికి షాక్, జైలులోనే

రాగిణి ద్వివేది బిజెపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలోనే ఆమె మెడకు డ్రగ్స్ కేసు చుట్టుకున్నట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం రాగిణి ద్వివేది షూటింగ్ నిమిత్తం హైదరాబాదు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కర్ణాటక బిజెపి వ్యవహారాల ఇంచార్జీ మురళీధర్ రావును రాగిణి కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. 

Also Read: సంజన, రాగిణిల ఫోన్లలో సంచలన విషయాలు

తాను పార్టీలో చేరుతానని, తనకు ఇప్పటికిప్పుడు పదవులేమీ అక్కరలేదని, కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని ఆమె మురళీధర్ రావుతో చెప్పినట్లు సమాచారం. రాగిణిని పార్టీలో చేర్చుకుని బీబీఎంపీ ఎన్నికల్లో ఆమె సేవలను వాడుకోవాలని పలువురు బిజెపి నేతలు భావించారని కూడా చెబుతున్నారు. అయితే, ఇంతలోనే ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు.