Asianet News TeluguAsianet News Telugu

సంజన, రాగిణిల ఫోన్లలో సంచలన విషయాలు

సంజన, రాగిణి వాట్సప్‌ చాట్‌లలో మరికొంత మంది సినీతారలకు కూడా డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్టుగా ఆధారాలు దొరికినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరికొంత సమాచారాన్ని రాగిణి, సంజనాలు డిలీట్ చేసినట్టుగా భావిస్తున్నారు. అందులో వారు పార్టీలు చేసుకున్న వీడియోలు, ఫోటోలు ఉంటాయని భావిస్తున్నారు.

CBI Police focuses Ragini, Sanjana mobile data
Author
Hyderabad, First Published Sep 14, 2020, 12:04 PM IST

సాండల్‌వుడ్‌లో డ్రగ్స్‌ కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తుండటంతో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు అరెస్ట్ కూడా కావటం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సీసీబీ అదుపులో ఉన్నారు. ఇప్పటికే వారి కాల్ రికార్డ్స్, వాట్సప్‌ చాట్స్‌ను పరిశీలించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసినట్టుగా సాండల్‌వుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు వారి వాట్సప్‌ చాట్‌లలో మరికొంత మంది సినీతారలకు కూడా డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్టుగా ఆధారాలు దొరికినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరికొంత సమాచారాన్ని రాగిణి, సంజనాలు డిలీట్ చేసినట్టుగా భావిస్తున్నారు. అందులో వారు పార్టీలు చేసుకున్న వీడియోలు, ఫోటోలు ఉంటాయని భావిస్తున్నారు. ఆ ఫోటోలను తిరిగి సేకరించగలిగితే అందులో డ్రగ్స్‌తో లింకులు ఉన్న మరింత మంది వ్యవహారం బయట పడుతుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు మరోసారి సంజన, రాగిణిలను కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాగిణిని మూడుసార్లు, సంజనను రెండు సార్టు ప్రశ్నించారు. వీరిద్దరి బెయిల్ పీటిషన్లపై కూడా విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారి భవితవ్యం ఏంటని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రాగిణిపై కేవలం డ్రగ్స్ కలిగిఉండటం వాడటం లాంటి కేసులు మాత్రమే ఉండగా, సంజన పై మాత్రం డ్రగ్స్‌ సప్లయి చేసిన కేసు కూడా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios