ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై  ఫోర్జరీ ఆరోపణలు వెలువడ్డాయి. తమ సమ్మతి లేకుండానే  ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరినట్టుగా  ఐదుగురు ఎంపీలు ఆరోపించారు. 

న్యూఢిల్లీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఐదుగురు రాజ్యసభ ఎంపీలు ఆరోపించారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని తమ సంతకాలను ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఫోర్జరీ చేశారని ఎంపీలు ఆరోపించారు. నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) 2023 బిల్లుకు సోమవారంనాడు రాత్రి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఐదుగురు ఎంపీలు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై ఆరోపణలు చేశారు. ఈ విషయమై విచారణ జరుపుతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ ప్రకటించారు.

అయితే ఈ ఆరోపణలపై రాఘవ్ చద్దా స్పందించారు. ప్రివిలేజ్ కమిటీ తనకు నోటీసులు పంపనివ్వండన్నారు. నోటీసులు పంపితే ఆ కమిటీకి సమాధానం ఇస్తాననని ప్రకటించారు.ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని చద్దా చేసిన సవరణ వాయిస్ ఓటుతో తిరస్కరించింది రాజ్యసభ. తమ అనుమతి లేకుండానే సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లును పంపాలని రాఘవ్ చద్దా పేర్కొన్నారని ఆ ఎంపీలు ఆరోపించారు. పాంగ్నోన్ కొన్యాక్, నరహరి అమీన్, సుధాన్షు త్రివేది, ఎం. తంబిదురై, సస్మిత్ పాత్రలు రాఘవ్ చద్దాపై ఆరోపణలు చేశారు.

also read:ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు: రాజ్యసభలో ఆమోదం

ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ఆప్ నేత రాఘవ్ చద్దా ప్రతిపాదనపై తమ పేర్లను రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ చదవడంతో ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సమ్మతి లేకుండానే తమ పేర్లను చేర్చారని రాఘవ్ చద్దాపై ఎంపీలు ఫిర్యాదు చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ విషయమై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని అమిత్ షా పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి సూచించాలని ఎంపీలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. ఈ సంతకాలు ఎవరు చేశారనేది విచారణలో తేలుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. మరో వైపు ఈ విషయమై విచారణ చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ను కోరారు.