ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు  రాజ్యసభ  సోమవారంనాడు రాత్రి  ఆమోదం తెలిపింది.  ఈ బిల్లుకు  అనుకూలంగా  131 ఓట్లు వచ్చాయి.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు సోమవారంనాడు రాత్రి రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనుంది కేంద్రం.నేషనల్ కేపిటల్ టెరిటర్ ఆఫ్ ఢిల్లీ(సవరణ) 2023 బిల్లును ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై ఇవాళ మధ్యాహ్నం చర్చను కాంగ్రెస్ సభ్యులు అభిషేక్ సింఘ్వి ప్రారంభించారు. ఈ బిల్లును కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

 ఈ బిల్లును వ్యతిరేకించే పార్టీలు బలం 102కు మాత్రమే పరిమితమైంది. ఈ బిల్లుకు మద్దతు తెలిపే వారి సంఖ్య 131కి చేరింది. దీంతో ఈ బిల్లు పాస్ అయిందని రాజ్యసభ వైఎస్ చైర్మెన్ ఇవాళ సభలో ప్రకటించారు. ఈ నెల 3వ తేదీన ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఆప్ వ్యతిరేకిస్తుంది.ఈ ఆర్డినెన్స్ ను నిరసిస్తూ విపక్షాలను కూడగట్టింది. ఈ విషయమై సుప్రీంకోర్టును కూడ ఆప్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఈ నెల 1న లోక్ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు ప్రవేశ పెట్టిన రెండు రోజులకే లోక్ సభలో ఆమోదం పొందింది. విపక్ష సభ్యులు ఈ బిల్లును నిరసిస్తూ లోక్ సభ నుండి వాకౌట్ చేశారు. ఇవాళ రాజ్యసభలో ఈ బిల్లును అమిత్ షా ప్రవేశ పెట్టారు. ఇవాళ రాత్రి ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రాంతీయ పార్టీలు కొన్ని ఈ బిల్లుకు మద్దతును తెలిపాయి. 

Scroll to load tweet…