కర్ణాటక బీజేపీ ఎంపీ ఓ మహిళ పట్ల ప్రవర్తించిన తీరు వివాదస్పదంగా మారింది. నొదుట బొట్టు పెట్టుకోవాలని ఎంపీ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహిళా దినోత్సవం రోజే ఇది చోటు చేసుకోవడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

మహిళా దినోత్సవ వేడుకల్లో నొదుట బొట్టు ధరించలేదని ఓ మహిళపై కర్ణాటక బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కోలార్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు మునిస్వామి ఓ మహిళ బొట్టు పెట్టుకోకకపోవడంపై మండిపడ్డారు. మీ భర్త బతికే ఉన్నాడని, ఇలా చేయడం సరికాదని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాల వైరల్ గా మారింది.

మహారాష్ట్రలో బిఆర్ఎస్ జోరు... కిసాన్ సెల్ అధ్యక్షుడి సమక్షంలో భారీగా చేరికలు

కర్ణాటకలోని కోలారు సిటీలో ఉన్న టి చన్నయ్య థియేటర్‌లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక స్టాల్స్‌లో వస్తువులను ప్రదర్శించి విక్రయించారు. ఇలా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మునిస్వామి పరిశీలిస్తున్నాడు. అయితే ఓ మహిళ నిర్వహిస్తున్న బట్టల స్టాల్ కియోస్క్ వద్ద ఆయన ఆగిపోయాడు. “ఈ స్టాల్ పెట్టడానికి మిమ్మల్ని ఎవరు అనుమతించారు? మీ బిందీ (బొట్టు) ఎక్కడ ఉంది? మీ భర్త ఇంకా బతికే ఉన్నాడు కదా” అని అరిచాడు. బిందీ ధరించాలని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిందీ ధరించనందుకు, ఆ మహిళకు ‘‘కామన్ సెన్స్’’ లేదని అన్నారు. 

Scroll to load tweet…

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా మునిస్వామి తీరుపట్ల మండిపడుతున్నారు. ‘‘మహిళల స్వేచ్ఛను హరించి వారి దుస్తులను నిర్ణయించడానికి బీజేపీకి ఏ హక్కు ఉంది? మహిళా దినోత్సవం రోజున మహిళలను అవమానించారు, వక్రీకరించారు’’ అని కర్ణాటక కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీ మహిళా వ్యతిరేక విధానానికి మునిస్వామి వ్యాఖ్యలు నిదర్శనమని అన్నారు.