Asianet News TeluguAsianet News Telugu

పౌరీ గర్వాల్ బస్సు ప్రమాదం.. ఇప్ప‌టి వ‌ర‌కు 16 మందిని రక్షించిన సిబ్బంది

పౌరీ గర్వాల్ బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 16 మందిని రక్షించినట్టు పోలీసులు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. స్థానికులు కూడా ఈ సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 

Puri Garhwal bus accident.. So far 16 people have been saved by the staff
Author
First Published Oct 5, 2022, 8:07 AM IST

ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో పెళ్లి ఊరేగింపుగా వెళ్తున్న బ‌స్సు 500 మీట‌ర్ల లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు బ‌స్సులో 45-50 మంది వ‌ర‌కు ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే ఘ‌ట‌న‌లో 25 మంది వ‌ర‌కు చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. 

మాస్ట‌ర్ స్ట్రోక్ .. బాల్ థాకరే పేరిట 700 క్లినిక్‌లను తెర‌వ‌నున్న షిండే ప్ర‌భుత్వం

కాగా ప్ర‌మాద స‌మాచారం అందిన వెంట‌నే రెస్క్యూ సిబ్బంది అక్క‌డికి చేరుకున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 16 మందిని రక్షించినట్లు హరిద్వార్ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిటీ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు.

‘‘ లాల్‌ధంగ్ నుండి పెళ్లి ఊరేగింపుగా బ‌య‌లుదేరిన బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు కుటుంబ స‌భ్యుల నుంచి మ‌రింత స‌మాచారం సేక‌రిస్తున్నారు. ప్ర‌మాద స్థ‌లానికి పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ’’ అని హరిద్వార్ సిటీ ఎస్పీ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు.

అలా చేస్తే.. నిత్యం మ‌ర‌ణ‌హోం జ‌రుగుతుంద‌న్నారు.. కానీ ఇప్పుడు ఎలా ఉందో చూడండి

‘‘ బస్సులో మహిళలు, పిల్లలతో పాటు దాదాపు 40-42 మంది ఉన్నారు. మేము పౌరి పోలీసులు, గ్రామస్తులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఇప్పటి వరకు 15-16 మందిని రక్షించి సమీప ఆసుపత్రికి పంపారు. మరణాలపై సమాచారం అందుతోంది’’ అని ఆయన తెలిపారు. 

కాగా.. ఈ ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ప్రథమ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితులను రక్షించేందుకు గ్రామస్థులు కూడా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లా యంత్రాంగం అక్కడికి చేరుకుంది. ఈ ఘటన సమాచారం అందిన వెంట‌నే సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రస్తుతం సచివాలయంలోని డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌కు చేరుకున్నారు. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఆయన తెలుసుకున్నారు. నేటి కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న వాయిదా వేసుకున్నారు. 

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ‘‘ ఇది చాలా బాధాకరమైన సంఘటన. బస్సులో దాదాపు 45 మంది ఉన్నారు. బస్సు లోతైన లోయలో పడిపోయింది. అక్కడి అధికారులతో మాట్లాడాను. వీలైనంత త్వరగా సహాయక చర్యలు ప్రారంభించాలని నేనే అందరితో మాట్లాడుతున్నాను. సాధ్యమైన అన్ని సహాయాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం ’’ అని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios