sex abuse case: సెక్స్ కుంభకోణంలో ట్రంప్, క్లింటన్.. మరోసారి తెరపైకి జెఫ్రీ ఎప్‌స్టీన్
sex abuse case: సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బ్రిటన్ రాణి కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ, ప్రముఖ అటార్నీ అలన్ డెర్షోవిజ్ వంటి ఎంతో మంది ప్రముఖులు ఈ కుంభకోణంలో పాలుపంచుకొన్నట్లు ఆరోపణలున్నాయి.
sex abuse case: సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలోని విలాసవంతమైన జీవితాల వెనుక చీకటి కోణాన్ని ఆ కుంభకోణం బయటపెట్టింది. ఆ సంపన్న ఫైనాన్షియర్ తన అవసరాలను తీర్చుకోవడానికి, పరపతి పెంచుకోవడం కోసం ఏళ్ల తరబడి టీనేజ్ అమ్మాయిలను ధనవంతులకు దగ్గరకు పంపాడు. ఆయన అమ్మాయిలను పంపించిన ధనవంతుల జాబితాలో ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు.. బ్రిటన్ రాణి సుపుత్రుడు.. వ్యాపారవేత్తలు.. ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు. చివరికి బండారం బయటపడి జైలుపాలయ్యాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. అనుమానస్పదంగా జైల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ సెక్స్ కుంభకోణంలో జెఫ్రీ ఎపిస్టన్ తో కలిసి పాలుపంచుకున్న ఆయన స్నేహితురాలు గిలిన్ మాక్స్‌వెల్ పై తాజాగా నేర నిరూపణ జరగడంతో ఈ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది.
Also Read: Revanth Reddy: కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
సెక్స్ కుంభకోణం నడిపించిన ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్.. ఆయన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జన్మించాడు. భౌతిక శాస్త్రం, గణితం విద్యాను అభ్యసించాడు. కానీ, డిగ్రీ మాత్రం పూర్తి చేయలేదు. 1970ల్లో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా చేరగా.. ఆ తర్వాత నాలుగేళ్లకే ఎపిస్టన్ అండ్ కో అనే అసెట్‌మేనేజ్‌మెంట్ సంస్థను ప్రారంభించడం.. ఆ సంస్థ వేగంగానే అభివృద్ది చెందడం జరిగిపోయింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో రాజభవనాన్ని తలపించే ఇంటిని కొనుగోలు చేయడంతో పాటు అప్పట్లోనే న్యూయార్క్‌లో అతిపెద్ద ప్రైవేట్ హోమ్‌ను సొంతం చేసుకొన్నాడు. ఇక్కడ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కళాకారులకు పార్టీలు ఇచ్చేవాడు.
Also Read: Assembly Elections2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి .. లేకుంటే..?
అయితే, ఎపిస్టన్‌కు ఉన్న ఓ ప్రైవేటు బోయింగ్ 747 విమానంలో హైప్రొఫైల్ మిత్రులతో కలిసి విదేశాలకు వెళ్లడం.. అందులో యువతులు, బాలికలు అనుమానాస్పదంగా కనిపిస్తుండేది. ఇక 2002 సెప్టెంబర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, నటులు కెవిన్ స్పాసీ, క్రిస్ టక్కర్‌తో కలిసి ఎపిస్టన్ ప్రైవేటు జెట్‌లో ఆఫ్రికా ఖండంలో పర్యటించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఎపిస్టన్ అని న్యూయార్క్ మ్యాగజైన్ ‘నిగూఢమైన కుబేరుడు: జెఫ్ ఎపిస్టన్’ అనే కథనం రాసింది. ఈ కథనం కోసం అప్పట్లో ప్రముఖ వ్యాపారిగా పేరున్న డొనాల్డ్ ట్రంప్ స్పందనలు కూడా తీసుకుంది. ‘‘15 ఏండ్లుగా ఎపిస్టన్ తెలుసు. అద్భుతమైన వ్యక్తి. అతడు కూడా నాలానే అందమైన యువతులు, బాలికలను ఇష్టపడతాడు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే 2003లో ‘న్యూయార్క్ ’ పత్రికను కొనేసేందుకు ఎపిస్టిన్ చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ అవి ఫలించలేదు. ఇదిలావుండగా, కొంతకాలానికి ఎపిస్టన్, ట్రంప్ మధ్య ఆర్థిక విషయాల్లో వివాదాలు జరిగినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు బిల్‌క్లింటన్.. ఎపిస్టన్‌తో కలిసి 27సార్లు వివిధ పర్యటనలకు వెళ్లినట్లు ఫ్లైట్ రికార్డులు 2016లో బయటపడ్డాయి.
Also Read: coronavirus: టీనేజర్స్ కు నేటి నుంచి వ్యాక్సినేషన్.. ఇప్పటికే 6.79 లక్షల మంది రిజిస్ట్రేషన్..
ఈ నేపథ్యంలోనే ఎపిస్టిన్.. సెక్స్ కుంభకోణం బయటపడింది. మధ్య తరగతి బాలికలు, యువతులకు డబ్బు ఆశగా చూపించి.. పామ్ బీచ్ బంగ్లాకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి.. మరో యువతిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకొంత మొత్తం కమిషన్ ఇస్తానని ఆశచూపేవాడు. ఈ ఉచ్చులో చిక్కుకొన్న వారు.. ఎలా బయటపడాలో తెలియక ఎపిస్టన్ చెప్పినట్లు నడుచుకునే వారు. 2005లో ఓ బాలిక తల్లిదండ్రులు ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎపిస్టన్ వ్యవహారం వెలుగు చూసింది. పామ్ బీచ్‌లోని అతడి భవనంపై పోలీసులు దాడి చేసి అభ్యంతరకర వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికే ఎపిస్టన్ చాలావరకూ ఆధారాలు లేకుండ చేశాడు కానీ.. పలు నేరాలు నిరూపితం కావడంతో దాదాపు 13 నెలల జైలు జీవితం గడిపాడు. అయితే, 2019లో మీటూ ఉద్యమం మొదలు కావడంతో మరోసారి ఎపిస్టన్‌పై ఆరోపణలు రావడంతో నిర్భంధంలోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అతని ఇంట్లో సోదాలు చేయగా ‘ఛైల్డ్ పోర్నోగ్రఫీ’, నకిలీ పాస్‌పోర్టు దొరికాయి. ఈ క్రమంలోనే అదే ఏడాదిలో ఆగస్టులో జైల్లో అనుమానస్పదంగా మరణించాడు. ఇక అతనికి నేరాల్లో సహకరించిన గిలెన్ మ్యాక్స్‌వెల్‌పై తాజాగా పలు నేరాలు నిరూపితం అయ్యాయి. ఆమెకు 40 ఏడ్ల జైలు శిక్ష పడే అవకాశముందని సమాచారం.
Also Read: UP Elections 2022: ఒకప్పుడు నేరస్తులకు అడ్డా.. నేడు క్రీడాకారుల గడ్డ.. ! :ప్రధాని మోడీ