Asianet News TeluguAsianet News Telugu

Punjab Congress: పంతం నెగ్గించుకున్న సిద్ధూ: ఏజీ ఔట్

పంజాబ్ కాంగ్రెస్‌లో లుకలుకలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, పీపీసీసీ చీఫ్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, సీఎం చన్నీకి మధ్య తాత్కాలికంగా సయోధ్య కుదిరినట్టు తెలుస్తున్నది. సిద్ధూ డిమాండ్ మేరకు ఏజీగా ఏపీఎస్ డియోల్ రాజీనామాను ఆమోదించినట్టు సీఎం చన్నీ వెల్లడించారు. ఎట్టకేలకు సిద్ధూ మరోసారి తన పంతాన్ని నెగ్గించుకున్నారు.

punjab CM accepted AG aps deol resignation
Author
Chandigarh, First Published Nov 9, 2021, 6:50 PM IST

చండీగడ్: పంజాబ్ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతున్నది. Congress పార్టీలోనే వర్గాల వైరం జరుగుతూనే ఉన్నది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ Navjot Singh Sidhu తరుచూ బహిరంగంగా దాడి చేయడం.. తీవ్ర విమర్శలు చేయడంతో చివరికి ముఖ్యమంత్రి పదవికి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకే కెప్టెన్ అమరీంద్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ వీడినప్పటికీ సిద్ధూ దాడి ఆగడం లేదు. కాంగ్రెస్ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రిగా నియమించిన చరణ్‌జిత్ సింగ్ చన్నీపైనా సిద్ధూ పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు సిద్ధూ తన పంతాన్ని నెగ్గించుకున్నారు.

Punjab సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ.. నవ్‌జోత్ సింగ్ సిద్ధూ పక్కనే కూర్చుని అడ్వకేట్ జనరల్ ఏపీఎస్ డియోల్ రాజీనామాను స్వీకరించినట్టు వెల్లడించారు. పంజాబ్ క్యాబినెట్ అడ్వకేట్ జనరల్ Resignationను అంగీకరించిందని చన్నీ విలేకరులకు తెలిపారు. రేపటి లోగా కొత్త ఏజీని నియమిస్తామని చెప్పారు.

Also Read: రాజీనామా వెనక్కి తీసుకున్న సిద్దూ.. కాంగ్రెస్‌కు మరో అల్టిమేటం.. ‘అప్పుడే ఆఫీసులో అడుగుపెడతా’

కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా రాజీనామా చేసిన తర్వాత చరణ్‌జిత్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కెప్టెన్‌తో పాటే ఏజీ అతుల్ నందా వైదొలిగారు. దీంతో చన్నీ సారథ్యంలోని మంత్రి మండలి కొత్త ఏజీగా ఏపీఎస్ డియోల్‌ను డీజీపీగా ఇక్బల్ సింగ్ సహోతాలను నియమించింది. ఈ రెండు నిర్ణయాలు నవ్‌జోత్ సింగ్ సిద్ధూకు కోపాన్ని తెచ్చేవిగానే చూశారు.

ఇదే తరుణంలో నవ్‌జోత్ సింగ్ సిద్దూ పీపీసీసీ పదవికి రాజీనామా చేశారు.

ఇటీవలే ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కానీ, అడ్వకేట్ జనరల్‌గా ఏపీఎస్ డియోల్‌ను తొలగించిన తర్వాతే తాను పార్టీ కార్యాలయంలో అడుగు పెడతానని స్పష్టం చేశారు.

ప్రస్తుత అడ్వకేట్ జనరల్ డియోల్ రాష్ట్రంలో అకాలీల ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ పోలీసు చీఫ్ సుమేద్ సైనీకి కౌన్సెల్‌గా ఉన్నారు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌ని అవమానపరిచిన ఘటన, ఆందోళనకారులపై పోలీసుల ఫైరింగ్ కేసులో ప్రభుత్వం తరఫున ఆయన వాదించారు. పోలీసు అధికారికి బెయిల్ కోసం వాదించారు. 

Also Read: ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’.. కెప్టెన్ అమరీంద్ సింగ్ కొత్త పార్టీ పేరు.. కాంగ్రెస్‌కు రిజైన్

నవ్‌జోత్ సింగ్ సిద్ధూ నుంచి విమర్శలు, మాటల దాడి నేపథ్యంలోనే ఏపీఎస్ డియోల్ ఏజీ పదవికి రాజీనామాను సీఎం చన్నీకి అందించారు. కానీ, ఆ రాజీనామాను చన్నీ తిరస్కరించినట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. దీంతో సీఎం చన్నీకి, పీపీసీసీ చీఫ్ సిద్ధూకు మధ్య చెడిందని వార్తలు వచ్చాయి.

తాజాగా, వీరిద్దరి మధ్య తాత్కాలికంగా ఓ సంధి కుదిరినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల దూరంలోనే ఉన్న తరుణంలో ఇరువురూ పక్క పక్కనే కూర్చుని విలేకరులతో మాట్లాడారు. సిద్ధూ సమక్షంలోనే ఏపీఎస్ డియోల్ రాజీనామాను స్వీకరిస్తున్నట్టు సీఎం చన్నీ వెల్లడించారు. దీంతో సిద్ధూ మరోసారి పంతం నెగ్గించుకున్నాడనే చర్చ జరుగుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios