స్కూల్ కు లేట్ గా వచ్చాడని ఓ టీచర్ స్టూడెంట్ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. 200 సిట్ అప్ లు తీయాలని శిక్ష విధించాడు. దీంతో ఆ స్టూడెంట్ అనారోగ్యానికి గురయ్యాడు.
గుజరాత్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గిర్-సోమ్‌నాథ్ జిల్లా ఉనా నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ప్రార్థనకు ఆలస్యంగా వచ్చాడని ఆ బాలుడికి 200 మంది సిట్‌అప్‌ల శిక్ష విధించాడు. ఆ శిక్ష పూర్తి చేసిన విద్యార్థి మరుసటి రోజు అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ లో చేరాడు. అతడికి కిడ్నీలో వాపు వచ్చిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన మహేశ్‌గిరి గోస్వామి టీ-స్నాక్ కార్ట్ నడుపుతుంటారు. ఆయన కుమారుడు కరణ్ గ్రాంటెడ్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో కరణ్ బుధవారం ఆలస్యంగా పాఠశాల ప్రార్థన సమావేశానికి చేరుకున్నాడు. దీంతో అక్కడి టీచర్ ఆ బాలుడికి 200 సిట్-అప్‌లు చేయాలని ఆదేశించాడు. దీంతో ఆ విద్యార్థి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వెంటనే మహేశ్ గిరి గోస్వామి అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజ్‌కోట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఇంకెప్పుడూ బీజేపీతో పొత్తు పెట్టుకోబోము - బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్..
ఈ ఘటనపై బాధితుడి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి కిడ్నీ వాచిపోయిందని అన్నారు. వాపు కారణంగా డాక్టర్ డయాలసిస్ చేయాలని సూచించారని, కానీ తన ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్పారు. హాస్పిటల్ ఖర్చులు విపరీతంగా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Bharat Jodo Yatra: వేయి కీలో మీటర్లకు చేరువైన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర.. !
దీనిపై ఆ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) రాజేష్ దొడియా విచారణకు ఆదేశించారు. ఈ ఘటనను తాను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. ఇది 15 రోజుల క్రితం జరిగిన ఘటన అని స్కూల్ ప్రిన్సిపాల్ డీజే వాజ, ఉపాధ్యాయులు తనతో చెప్పారని పేర్కొన్నారు. ‘‘ ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ఆరోపణల్లో నిజం ఉందని తేలితే ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం ’’ అని తెలిపారు.
