Asianet News TeluguAsianet News Telugu

ఇంకెప్పుడూ బీజేపీతో పొత్తు పెట్టుకోబోము - బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్..

ఇకపై బీజేపీతో పొత్తు ఉండబోదని, సోషలిస్టులతోనే కలిసి పని చేస్తామని బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రస్తుత బీజేపీ నాయకత్వం అహంకారంతో నిండి ఉందని ఆరోపించారు. 

Bihar CM Nitish Kumar Yadav will never ally with BJP again.
Author
First Published Oct 15, 2022, 9:00 AM IST

ఇకపై బీజేపీతో తమ పార్టీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోబోమని జేడీ(యూ) అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ అన్నారు. సమాజ్ వాదీ (సోషలిస్టులు)లతో కలిసి కలిసి పని చేస్తుందని చెప్పారు. బీహార్‌లోని ప్రస్తుత మహాఘట్‌బంధన్ ప్రభుత్వంలో విభేదాలు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

Bharat Jodo Yatra: వేయి కీలో మీట‌ర్ల‌కు చేరువైన కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర‌.. !

‘‘బీజేపీ కేవలం సమాజంలో వైరుధ్యం సృష్టించడానికే పనిచేస్తోంది. దానికి దేశ ప్రగతితో ఎలాంటి సంబంధం లేదు. నా జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోను. సమాజ్‌వాదీలతో (సోషలిస్టులు) ఉండి బీహార్‌తో పాటు దేశాన్ని ముందుకు తీసుకెళ్తాను. ’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి బీజేపీ పితామహులను తాను గుర్తుంచుకుంటానని, కానీ పార్టీ ప్రస్తుత నాయకత్వం అహంకారంతో నిండి ఉందని అన్నారు. “1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆయన నన్ను కేంద్ర మంత్రిని చేశారు. మూడు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి దేశాభివృద్ధికి కృషి చేశారు. నేడు కేంద్రంలో కూర్చున్న వారికి అభివృద్ధితో సంబంధం లేదు. వారు అహంకారంతో ఉన్నారు ” అని ఆయన అన్నారు.

ఈ నెల 18 వ‌ర‌కు ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు.. ఐఎండీ హెచ్చ‌రిక‌లు

ఇదిలా ఉండగా.. బీహార్ లో 2019లో నితీష్ కుమార్ యాదవ్ పార్టీ అయిన జేడీయూ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అనంతరం ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఇటీవల మారిన రాజకీయ పరిణామాల వల్ల ఆ పార్టీ బీజేపీతో తెగదింపులు చేసుకుంది. తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అయిన ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుంచి బీజేపీ, జేడీయూ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మూడు రోజుల కిందట బీహార్ లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా నితీష్ కుమార్ యాదవ్ పై విమర్శలు చేశారు. జేడీయూపై విరుచుకుపడ్డారు. జేపీ ఉద్యమం ద్వారా ఎదిగిన నితీష్ కుమార్.. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని మర్చిపోయారని అన్నారు. ఆయన అధికార దాహం ఉన్న వ్యక్తి అని విమర్శించారు.

పాకిస్థాన్‌తో భారత్ సాధారణ సంబంధాలను కోరుకుంటుంది, అయితే.. : విదేశాంగ శాఖ కీల‌క వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన జేపీ ఉద్యమం ద్వారా కుమార్ ఖ్యాతిని పొందారని, తరువాత అధికారం కోసం తిరిగి కాంగ్రెస్ ఒడిలోనే కూర్చున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ నేను బీహార్ ప్రజలను అడుగుతున్నాను. జయ ప్రకాశ్ నారాయణ్ ఉద్యమం ద్వారా ఔన్నత్యాన్ని సాధించిన నాయకులు ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్ ఒడిలో కూర్చున్నారు. మీరు వారితోనే ఉంటారా ? ’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ పర్యటన సందర్భంగా జేపీ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios