న్యూఢిల్లీ:పుల్వామాలో సైనికులపై దాడికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. దాడికి పాల్పడినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం నాడు జాతీయ భద్రతా వ్యవహరాల కమిటీ సమావేశం తర్వాత భారత ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు.అమరుల కుటుంబాలకు తాము అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఇలాంటి దాడులను ఖండించాల్సిందేనన్నారు.

సైనికుల ధైర్య సాహసాలపై తమకు నమ్మకం ఉందన్నారు. ఇలాంటి దాడులతో బెదిరించాలనే పాకిస్థాన్ కుట్రలు ఫలించవని  మోడీ చెప్పారు. ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్నవారు పెద్ద సాహసం చేశారని మోడీ అభిప్రాయపడ్డారు.

అమరుల త్యాగాలను వృధాకా నివ్వమని మోడీ తేల్చి చెప్పారు. ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరైందికాదన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమని మోడీ చెప్పారు.


 సంబంధిత వార్తలు

42 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్: ఎవరీ ఆదిల్?

"నేను స్వర్గంలో ఉంటా": జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాది చివరి మాటలు

జమ్మూ కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి తెగబడిన ముష్కరులు..20మంది ఆర్మీ జవాన్ల మృతి