భారత  అంతర్జాతీయ సద్దు రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ లో మరోసారి హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది. భారత ఆర్మీ సైనికులను టార్గెట్ గా పుల్వామా జిల్లా  అవంతిపురా ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి 44 మంది జవాన్లు మృత్యువాతపడగా చాలా మంది తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం.  జైషే మొహమ్మద్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. పేలుడు పదార్థాలతో ఉన్న కారు సిఆర్పీఎఫ్ కాన్వాయ్ లోకి చొరబడి విధ్వంసాన్ని సృష్టించింది.

సిఆర్పీఎఫ్ జవాన్లు 78 బస్సుల్లో కాన్వాయ్ గా వెళ్తుండగా, పేలుడు పదార్థాలతో నిండిన కారు ఓ బస్సును ఢీకొట్టింది. దాంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. జవాన్ల శరీరాలు తునాతునకలై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఉగ్రవాదాలు మహీంద్రా స్కార్పియోను వాడినట్లు తెలుస్తోంది. అందులో 350 కిలోలకు పైగా పేలుడు పదార్థాలున్నాయి.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌ఫిఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనంపై ఉగ్రవాదులు బాంబులతో తెగబడ్డారు. ఈ దాడి నుండి జవాన్లను కోలుకోనివ్వకుండా పేలుడు  జరిగిన వెంటనే కాల్పులకు కూడా తెగబడ్డారు. ఆత్మాహుతి దళ సభ్యుడితో పేలుడు పదార్థాలతో నిండిన కారును కాన్వాయ్ లోకి పంపి విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో భారీగా ప్రాణనష్టం జరిగింది.

ఈ ప్రమాదంలో 20మంది జవాన్లు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. అలాగే దాదాపు 45 మంది సైనికులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు దాటికి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పూర్తిగా ధ్వంసమయ్యింది. 

 ఆర్మీ వాహనంపై బాంబు దాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి వుంది. 

భారత ఆర్మీపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జమ్మే కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముప్తీ, ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. దాడిలో ప్రాణాలు  కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు వీరు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ ట్వీట్లు చేశారు.