PM Modi: మాతృభూమికి నిస్వార్థంగా, అంకితభావంతో సేవ చేసినందుకు NCC లో పొందిన శిక్షణ ఉప‌యోగ ప‌డింద‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో జరిగిన NCC ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. NCC గణతంత్ర దినోత్సవాల శిబిరం ముగింపు సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 28న ఈ ర్యాలీ జరుగుతుంది.  

PM Modi: మాతృభూమికి నిస్వార్థంగా, అంకితభావంతో సేవ చేసినందుకు NCC లో పొందిన శిక్షణ ఉప‌యోగ ప‌డింద‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దేశ రాజధాని ఢిల్లీలోని కరియప్పా గ్రౌండ్‌లో జరిగిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సిసి) ర్యాలీకి ప్ర‌ధాని హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని NCC ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు.

 ఒకప్పుడు ఎన్‌సిసిలో క్రియాశీల‌ సభ్యుడిగా ఉన్నందుకు తాను చాలా గర్వపడుతున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. NCCని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందనీ. పెద్ద సంఖ్యలో బాలికల క్యాడెట్లు కూడా NCC ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు.గత రెండేళ్లలో సరిహద్దు ప్రాంతాల్లో లక్ష మందికి పైగా కొత్త NCC క్యాడెట్‌లు చేర్చబడ్డారని ప్ర‌ధాని అన్నారు.

కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి గార్డ్ ఆఫ్ హాన‌ర్‌ను ప‌రిశీలించారు.ఎన్‌సిసి కంటెంజెంట్స్ మార్చి పాస్ట్‌ని సమీక్షించారు.NCC క్యాడెట్‌లు ఆర్మీ యాక్షన్, స్లిథరింగ్, మైక్రోలైట్ ఫ్లయింగ్, పారాసైలింగ్, ఇత‌ర విన్యాసాల‌ను, సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లను వీక్షించారు.

ప్ర‌ధాని మాట్లాడుతూ.. "మనమందరం భారతదేశ మూలాలతో అనుసంధానం కావాలి. మీ సంకల్పం, మద్దతుతో భారతదేశ భవిష్యత్తు మారుతోంది. యువ‌త మాదకద్రవ్యాల‌కు దూరంగా ఉండాలని , వాటికి వ్య‌తిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అని అన్నారు. స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా అమృత మహోత్సవాలను దేశం జరుపుకుంటోందన్నారు. అటువంటి సమయంలో జరుగుతున్న ఈ సంబరాలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. కరియప్ప మైదానంలో తాను అటువంటి ఉత్తేజాన్ని చూస్తున్నానని తెలిపారు. 

మోదీ మాట్లాడుతూ, ‘‘మీలాగే నేను కూడా ఒకప్పుడు చురుకైన NCC కేడెట్‌నని చెప్పడం గర్వంగా ఉంది. NCCలో నేను పొందిన శిక్షణ, నేర్చుకున్న విషయాలు, దేశం పట్ల నా బాధ్యతలను నిర్వర్తించడంలో నేడు నేను అద్భుతమైన శక్తిని పొందుతున్నాను’’ అన్నారు. 

స్వాతంత్య్రం లభించి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా అమృత మహోత్సవాలను దేశం జరుపుకుంటోందన్నారు. అటువంటి సమయంలో జరుగుతున్న ఈ సంబరాలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. కరియప్ప మైదానంలో తాను అటువంటి ఉత్తేజాన్ని చూస్తున్నానని తెలిపారు. ఎన్‌సిసి ర్యాలీ ముగిసిన తర్వాత ఎన్‌సిసి అభ్యర్థులకు ప్రధానమంత్రి పతకాలు మరియు లాఠీలను పంపిణీ చేశారు.