Asianet News TeluguAsianet News Telugu

కూతురి నుంచి సెల్యూట్ స్వీకరిస్తున్న ‘ప్రౌడ్ పోలీసు ఆఫీసర్’.. ఫొటో వైరల్

ఆ యువతి తండ్రి, తాతల అడుగుజాడలో నడిచింది. దేశానికి సేవలందించడానికే నిర్ణయించుకుంది. తండ్రి సరిహద్దులో పహారా కాసే ఐటీబీపీలో ఉంటే ఆమె పోలీసు వ్యవస్థలోకి చేరాలని నిర్ణయించుకుంది. పోలీసు అకాడమీలో డిగ్రీ పూర్తి చేసుకున్న ఆ యువతి పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆమె తన తండ్రికే సెల్యూట్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

proud daughters salute receives proud father in a viral photo
Author
Lucknow, First Published Nov 2, 2021, 1:54 PM IST

న్యూఢిల్లీ: పోలీసు డ్యూటీ అంటే అమితమైన ప్రేమ. ఆ ఇంట ఇప్పటికి మూడు తరాల నుంచి ఖాకీ Uniform ధరిస్తూ ఉన్నారు. దేశానికి సేవలందించడానికి ఆ కుటుంబం ముందుంటున్నది. Tibet దేశ సరిహద్దులో పహారా కాసే ITBP(ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు)లో ప్రస్తుతం డీఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏపీఎస్ నింబాడియా పుత్రికోత్సాహంతో హృదయాన్ని నింపుకున్నారు. ఆయన సేవలందిస్తున్న ఐటీబీపీలోకే తనయ కూడా వచ్చి చేరుతున్నారు. పాసింగ్ ఔట్ పరేడ్‌లో భాగంగా ఆమె తన తండ్రికే సెల్యూట్ చేశారు. ఆమె సెల్యూట్ స్వీకరిస్తూ తండ్రి డీఐజీ ఏపీఎస్ నింబాడియా ఉప్పొంగిపోయారు. ఈ మధురమైన క్షణాన్ని ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. అంతేకాదు, వారిద్దరి ఫొటోలనూ ఐటీబీపీ అధికారి సోషల్ మీడియా అకౌంట్ పోస్టు చేసింది.

ప్రౌడ్ ఫాదర్ ఏపీఎస్ నింబాడియా ఆమె సెల్యూట్‌ను స్వీకరిస్తున్నారు. ఆ ప్రౌడ్ డాటర్ అంతే గర్వంగా సెల్యూట్ చేస్తున్నారు. వీరిరువురి ఫొటోలకూ ప్రౌడ్ ఫాదర్.. ప్రౌడ్ డాటర్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఆ ప్రౌడ్ డాటర్ పేరు ఆపేక్ష నింబాడియా. ఉత్తరప్రదేశ్‌ మొరదాబాద్‌లోని డాక్టర్ అంబేడ్కర్ పోలీసు అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆపేక్ష నింబాడియా పాల్గొన్నారు. ఈ పాసింగ్ ఔట్ పరేడ్‌లో భాగంగానే తండ్రి డీఐజీ ఏపీఎస్ నింబాడియాకు ఆమె సెల్యూట్ చేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ITBP (@itbp_official)

కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆపేక్ష నింబాడియా Uttar Pradesh Police శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతల్లో చేరనున్నారు. చక్కగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించుకున్న కూతురిని చూసి తండ్రి ఆనందపడిపోతున్నారు. ఐటీబీపీ అధికారిక ఖాతా వీరి ఆనందాన్ని పౌరులకు పంచింది. ఈ సెల్యూట్ చిత్రంలోపాటు మరో రెండు చిత్రాలనూ షేర్ చేసింది. తండ్రి ఏపీఎస్ నింబాడియా, తల్లి బిమలేశ్ నింబాడియాలతో కలిసి ఆపేక్ష నింబాడియా దిగిన ఫొటోనూ షేర్ చేసింది. ఈ ఫొటోలనూ ముగ్గురి ముఖాలు వెలిగిపోతున్నాయి. దానితో పాటు ప్రత్యేకంగా తండ్రీ కూతురు పోలీసు యూనిఫామ్‌లో దిగిన చిత్రాన్ని పంచింది. పోలీసు యూనిఫామ్‌లో ఇద్దరూ ముసిముసి నవ్వులతో పోజు ఇచ్చిన వీరిద్దరినీ చూడవచ్చు.

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

తండ్రీ, తనయుల సెల్యూట్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే 17వేల లైకులు సొంతం చేసుకుంది. ఫొటోను ఐటీబీపీ పోస్టు చేసింది. పోస్టు చేసి 16 గంటలు గడిచాయో లేదో వేలాది లైకులు వచ్చి పడ్డాయి. చాలా మంది నెటిజన్లు వారిద్దరికీ సెల్యూట్ కొట్టారు. గర్వనీయమైన క్షణమని పేర్కొన్నారు. జై హింద్ అంటూ ఇంకొందరు కామెంట్లు చేశారు. ఇంకొందరు హార్ట్, స్టార్, క్లాప్ ఎమోజీలతో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

Also Read: సరిహద్దులో భారత ఆర్మీ మిస్సైల్ ఫైరింగ్.. వీడియో ఇదే..!

భారత కేంద్ర బలగాల్లో ఐటీబీపీ ఒకటి. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్సెస్‌లో ఐటీబీపీ ఒక విభాగం. చైనాతో యుద్ధం నేపథ్యంలో ఐటీబీపీని ప్రత్యేకంగా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ బలగాలు టిబెట్‌తో దేశం పంచుకుంటున్న సరిహద్దులో అంటే చైనా వైపునే పహారాకాస్తుంటాయి. ఈ బలగాలు రక్షణ వ్యవస్థలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios