Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోడీ పుట్టినరోజున భారత అడ‌వుల్లోకి చేరే 8 నమీబియా చిరుతల వివరాలు ఇవిగో..

Prime Minister Narendra Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ వారంలోనే త‌న 72వ పుట్టిన రోజును జ‌రుపుకోనున్నారు. ఈ ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతపులిలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి ప్రధాని మోడీ విడిచి పెట్ట‌నున్నారు.
 

8 Namibian leopards to come to India on Prime Minister Modi's birthday
Author
First Published Sep 15, 2022, 2:20 PM IST

Prime Minister Modi's birthday: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా న‌మీబియా నుంచి తీసుకువ‌చ్చిన చిరుత‌ల‌ను భార‌త అడ‌వుల్లోకి విడుదల చేయనున్నారు. ప్ర‌తి యేడాది ప్ర‌ధాని త‌న పుట్టిన రోజున అనేక కార్య‌క్ర‌మాల‌తో బిజీబిజీగా గ‌డుపుతూ పుట్టిన రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకుంటున్నారు. త‌న పుట్టిన రోజైన సెప్టెంబ‌ర్ 17న ప్ర‌ధాని మోడీ త‌న పుట్టిన రోజున త‌న త‌ల్లిని క‌లిసి.. ఆమె ఆశీర్వాదాలు తీసుకునీ, ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌డంతో బిజీబిజీగా ఉండ‌నున్నారు. ఈ ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతపులిలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి ప్రధాని మోడీ విడిచి పెట్ట‌నున్నారు. కాగా, ఈ చిరుతపులులు దేశంలో అంతరించిపోయినట్లు 1950లలో ప్రకటించారు.

ఎనిమిది నమీబియా చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తీసుకువచ్చి, ప్రధాని మోడీ తన పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 17న వాటి కొత్త నివాసంలోకి విడుదల చేస్తారు. నమీబియా రాజధాని విండ్‌హోక్ నుండి బోయింగ్ 747-400 విమానం ద్వారా వాటిని భార‌త్ కు తీసుకురానున్నారు. వాటిని ప్రధాన క్యాబిన్‌లోని బోనుల లోపల ఉంచుతారు. ఫ్లైట్ సమయంలో పశువైద్యులు వాటి ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తుంటార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌యాణ స‌మ‌యంలో వాటికి వికారం అనిపించకుండా ఉండటానికి వారికి ఆహారం ఇవ్వరు. శనివారం ఉదయం జైపూర్ చేరుకుంటాయ‌ని అధికారులు తెలిపారు. అటు నుంచి హెలికాప్టర్లలో కునో నేషనల్ పార్క్‌కు తీసుకెళ్లనున్నారు.

న‌మీబియా నుంచి తీసుకువ‌స్తున్న చిరుత‌ల వివ‌రాలు.. 

  • న‌మీబియా నుంచి ప్ర‌త్యేకంగా తీసుకువ‌స్తున్న ఈ చిరుత‌లు మొత్తం ఎనిమిది. ఈ ఎనిమిది చిరుతల సమూహంలో ఐదు ఆడ‌వి కాగా, మూడు మ‌గ చిరుత‌లు అని అధికారులు తెలిపారు. 
  • ఆడ చిరుతలు రెండు నుంచి ఐదు  సంవత్సరాల మధ్య ఉంటాయి. ఇక మగ చిరుతలు 4.5 సంవత్సరాల నుండి 5.5 సంవత్సరాల మధ్య ఉంటాయి.
  • 3 మగ చిరుతల్లో జూలై 2021 నుండి నమీబియాలోని చిరుత సంరక్షణ నిధి రిజర్వ్‌లో నివసిస్తున్న ఒకే దానికి పుట్టిన సోద‌రులు. 
  • ఈ జాతికి చెందిన చివరి చిరుత మరణించిన 74 సంవత్సరాల తరువాత, భారతదేశం నమీబియా నుండి ఎనిమిది చిరుత‌ల‌ను తీసుకువ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం. 
  • న‌మీబియా నుంచి తీసుకువ‌స్తున్న ఈ చిరుతల జాతి భార‌త్ లో అంతరించిపోయినట్లు 1950లలో ప్రకటించారు.
  • ప్ర‌స్తుతం భార‌త్ కు తీసుకువ‌స్తున్న మూడు మ‌గ చిరుత్లో రెండు సోద‌రులు కాగా, మ‌రో మగ చిరుత 2018లో వేరొక‌ రిజర్వ్‌లో జన్మించింది.
  • ఆగ్నేయ నమీబియాలోని గోబాబిస్ సమీపంలోని వాటర్‌హోల్ వద్ద ఆడ చిరుత ఒకటి కనుగొనబడింది. ఆ సమయంలో అది పోషకాహార లోపంతో బాధ‌ప‌డుతున్న‌ద‌ని గుర్తించారు. 2020లో చిరుత సంరక్షణ నిధి రిజర్వ్‌కు తీసుకువ‌చ్చారు. అయితే, దీనిని గుర్తించ‌డానికి ముందు దాని త‌ల్లి చిరుత అడ‌వి మంట‌ల్లో కాలిపోయిన‌ట్టు అక్క‌డి అధికారులు భావిస్తున్నారు. 
  •  రెండవ ఆడ చిరుతను CCF రిజర్వ్ పొరుగున ఉన్న అట‌వీ ప్రాంతం నుంచి తీసుకువ‌చ్చారు. 
  •  మూడవ ఆడ చిరుత ఏప్రిల్ 2020లో ఎరిండి ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో జన్మించింది. దాని తల్లి CCF పునరావాస కేంద్రంలో ఉన్న‌ది. రెండు సంవత్సరాల క్రితం తిరిగి దానిని అడవిలోకి పంపారు. 
  • ఈ స‌మూహంలోని నాల్గో చిరుత‌.. పోషకాహార లోపంతో 2017లో ఒక పొలంలో వుండ‌గా, అధికారులు గుర్తించి.. సంర‌క్షించారు. 
  • ఐదవ ఆడ చిరుత 2019లో గుర్తించారు. 4వ‌, 5వ చిరుతలు బెస్ట్ ఫ్రెండ్స్, అవి ఎప్పుడూ క‌లిసే ఉంటాయ‌ని స‌మాచారం. 
  • న‌మీబియా నుంచి తీసుకువ‌చ్చే ఈ చిరుత‌ల‌ను 30 రోజుల పాటు క్వారంటైన్ క్లోజర్‌లో ఉంచ‌నున్నారు. ఆ తర్వాత వారు 6 sqkm ప్రెడేటర్ ప్రూఫ్ ఫెసిలిటీలో విడుదల చేస్తారు.
     
Follow Us:
Download App:
  • android
  • ios